కోహ్లీ కెప్టెన్సీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గంభీర్….

7:49 pm, Wed, 1 May 19
gambhir comments on kohli

ఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు కోహ్లీ కెప్టెన్‌గా పనికిరాడని అన్నారు. ఈ ఐపీఎల్ ద్వారా మరోసారి ఈ విషయం రుజువైందని, అయినా కూడా బెంగళూరు యాజమాన్యం అతన్ని ఇంకా కెప్టెన్‌గా ఎందుకు కొనసాగిస్తుందో తెలియడం లేదన్నారు.

అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో టీమిండియా మెరుగ్గా రాణించాలంటే కెప్టెన్ బాధ్యతల నుండి కోహ్లీని తొలగించాలని డిమాండ్ చేశాడు. 2011 నుండి బెంగళూరు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ… ఈ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా జట్టుకు ట్రోపిని అందిచలేకపోయాడని విమర్శించాడు. దీన్ని బట్టే కోహ్లీ ఎంత చెత్త కెప్టెనో అర్థమవుతుందన్నారు. గతంలో కూడా కోహ్లీ కెప్టెన్సీపై గంభీర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

బ్యాటింగ్‌లో కోహ్లీ సూపర్…

ఇదిలా ఉంటే కోహ్లీ కెప్టెన్సీ గురించి విమర్శలు చేసిన గంభీర్….అతని ఆటపై మాత్రం ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ మరొకరు లేరన్నాడు. భారత ఆటగాడిగా అతడు సాధించిన పరుగులు,రికార్డులు, జట్టుకు అందించిన విజయాలు చాలా గొప్పవని చెప్పుకొచ్చాడు. కానీ కోహ్లీ కెప్టెన్సీని మాత్రం ఒప్పుకునే ప్రసక్తేలేదని గంభీర్ అన్నాడు.

చదవండి: ప్లే ఆఫ్ రేసులో బెంగళూరు ఔట్! రాజస్థాన్‌కీ కష్టమే…