వరల్డ్ కప్: ఆస్ట్రేలియానే ఫేవరెట్ అంటున్న గంభీర్…

10:51 am, Mon, 20 May 19
1
Gautam Gambhir Latest News, BJP Latest News, Newsxpressonline

న్యూఢిల్లీ: మే30 నుంచి క్రికెట్ సమరం ప్రపంచ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్‌గా దిగనుంది.

అలాగే ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కూడా ఈసారి గట్టిగా ఉన్నాయి. కానీ  ఇంగ్లండ్, భారత్ ఎంత పటిష్ఠంగా ఉన్నా.. టైటిల్ నెగ్గే అవకాశాలు మాత్రం ఆస్ట్రేలియాకే ఎక్కువ ఉన్నాయని టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు.

తన ఫేవరెట్ జట్టు ఆస్ట్రేలియానే అని చెప్పారు. అయితే భారత్, ఇంగ్లండ్ తన రెండో ఫేవరెట్ జట్లను గంభీర్ పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశమని, భారీ స్కోర్లు చేస్తూ.. ప్రస్తుతం ఆ జట్టు భీకరమైన ఫామ్‌లో ఉందని అన్నాడు.

ఆల్‌రౌండర్లు ఎక్కువ మంది ఉండటం ఇంగ్లండ్ ప్రధాన బలమని చెప్పుకొచ్చాడు. కానీ వరల్డ్ కప్‌లో ఆసీస్‌కి తిరుగులేదని…ఈ వరల్డ్ కప్‌లో కూడా ఆసీస్ ఫైనల్ చేరడం పక్కా అని చెప్పాడు.

ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్…ఇంగ్లండ్ లేదా ఇండియాతో గాని తలపడుతుందని జోస్యం చెప్పాడు.

చదవండిఅరుదైన ఘనత సొంతం చేసుకున్న కోహ్లీ…