కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్.. అంగీకరించిన సీజీఎఫ్

5:19 pm, Tue, 13 August 19

లండన్: క్రికెట్ ప్రియులకు ఇది శుభవార్తే. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ కనువిందు చేయనుంది. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌ను చేరుస్తున్నట్టు కామన్‌వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) నేడు ప్రకటించింది.

.ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయని, మొత్తం 8 దేశాలు పాల్గొంటాయని సీజీఎఫ్ పేర్కొంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో చివరిసారిగా 1998లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి. దక్షిణాఫ్రికా పురుషుల జట్టు వన్డేల్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఎప్పుడూ భాగం కాలేదు.