బుమ్రాకు డోప్ టెస్ట్…పాజిటివ్ వస్తే ఏం చేస్తారంటే?

10:27 am, Tue, 4 June 19

లండన్: ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియా..తన తొలి మ్యాచ్‌ రేపు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత్ ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అటు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా…టోర్నీలో తొలి గెలుపు రుచిని చూడాలనుకుంటుంది.

అయితే రేపు మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు డోప్ టెస్ట్ జరుగనుంది. సాధారణ ర్యాండమ్‌ టెస్ట్ లో భాగంగా యూరిన్ శాంపిల్‌ ఇవ్వాలని బుమ్రాకు వాడా తరఫున పనిచేసే ఏజన్సీ నుంచి సమాచారం అందింది.

ఇక ఈ ఏజెన్సీ శాంపిల్ ను పరీక్షించి, బుమ్రా ఏమైనా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడా? అన్న విషయాన్ని తేల్చనుంది. అయితే ఈ డోప్ పరీక్షలో పాజిటివ్ వస్తే, మరోసారి శాంపిల్ తీసుకుని పరీక్షలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత కూడా పాజిటివ్ వస్తే, తీసుకున్న ఉత్ప్రేరకం చూపే ప్రభావం ఆధారంగా కఠిన నిర్ణయాలు ఉంటాయి. ఒకోసారి ఆటగాడిపై నిషేధం వరకూ ఉండవచ్చు.

చదవండి: ప్రపంచ కప్: ఉత్కంఠ  పోరులో ఇంగ్లండ్‌పై పాక్ విజయం…