కోహ్లీ పేరు మార్చి చెప్పా: అనుష్క శర్మ

1:30 pm, Tue, 5 March 19
Virat-Kohli-Anushka-Sharma

ముంబై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల వివాహమై ఏడాదిపైనే అవుతోంది. 2017 డిసెంబరు‌లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి గురించి కుటుంబీకులకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదని అనుష్క, విరాట్‌ తమ పేర్లు మార్చేసుకున్నారట.

ఈ విషయాన్ని అనుష్క వోగ్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా పెళ్లి గురించి కుటుంబీకులకు, మా మేనేజర్లకు, స్టైలిస్ట్‌కు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదనుకున్నాం. అయితే భోజనాల విషయంలో మాత్రం కేటరర్లకు మా పేర్లు మార్చి చెప్పమన్నాం. విరాట్‌ పేరు బయటికి రాకుండా రాహుల్‌ అని పేరు మార్చాను.

42 మంది అతిథులే…

ఎందుకంటే మాకు ఇద్దరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటున్నారన్న ఫీలింగ్‌ ఉండకూడదు. పెళ్లిలో కేవలం 42 మంది అతిథులే ఉన్నారు. అలా ఓ ఇద్దరు సాధారణ వ్యక్తులు తమ కుటుంబీకుల సమక్షంలో ఎలా పెళ్లి చేసుకుంటారో.. మేం కూడా అలాగే చేసుకోవాలని ముందుగానే అన్నీ ప్లాన్‌ చేసుకున్నాం..’ అని వెల్లడించారు అనుష్క.

‘జీరో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క తన తర్వాతి చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. షారుక్‌ ఖాన్‌, అనుష్క, కత్రినా కైఫ్‌ నటించిన ‘జీరో’ బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైంది. కాగా కోహ్లీ ప్రపంచ కప్ సన్నాహాలలో చాలా బిజీగా ఉన్నాడు.