వారానికోసారి శృంగారం.. మరణాన్ని దూరం చేసే ఔషధం!

- Advertisement -

న్యూఢిల్లీ: శృంగారం వల్ల కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావని మరోమారు రుజువైంది. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒంట్లో కొవ్వు కరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మలి వయసులోనూ శృంగారాన్ని ఆస్వాదిస్తే మతిమరుపు దరికి చేరదని ఎన్నో పరిశోధనలు తేల్చాయి.

శృంగారం ఒత్తిడిని తరిమికొడుతుంది. శృంగారం వల్ల కలిగే మరో అద్భుత ప్రయోజనం ఒకటి తాజా పరిశోధనల్లో బయటపడింది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు వారానికోసారి శృంగారంలో పాల్గొంటే మరణం సంభవించే రేటు 37 శాతం తగ్గుతుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ, షార్ జెడెక్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హృద్రోగులు క్రమం తప్పకుండా వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొంటే దీర్ఘకాలం జీవిస్తారని తెలిపారు.

65 ఏళ్లలోపు ఉన్న 1120 మంది వ్యాధిగ్రస్తులను పరీక్షించగా, అందులో వారానికోసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనే వారిలో 37 శాతం మరణం సంభవించే రేటు తగ్గిందని తమ పరిశోధనల్లో వెల్లడైందని వారు తెలిపారు. అంతకంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో 33 శాతం, వారానికి, లేదంటే అంతకంటే ఎక్కువ రోజులు శృంగారంలో పాల్గొనే వారిలో 28 శాతం మరణం సంభవించే రేటు తగ్గిందని పరిశోధకులు తేల్చారు.

- Advertisement -