బడ్జెట్ ధరలో విడుదలైన రెడ్‌మీ నోట్ 7 ఎస్…

10:11 pm, Mon, 20 May 19

ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా దూసుకుపోతున్న షియోమీ సంస్థ నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్‌ను భార‌త మార్కెట్‌లో ఈరోజు విడుద‌ల చేసింది. రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ, రూబీ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల అయింది.

ఇక ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధ‌ర‌కు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధ‌ర‌కు ఈ నెల 23వ తేదీ నుంచి ల‌భ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌ల‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు.

రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచ‌ర్లు…

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెస‌ర్‌

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌

256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై

హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్‌

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0

యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0

చదవండి: అతి తక్కువ ధరలో ఐటెల్ కొత్త ఫోన్…