సూపర్ ఫీచర్లతో విడుదల కానున్న ఒప్పో రెనో జెడ్…

6:22 pm, Thu, 30 May 19

ఢిల్లీ: సెల్ఫీ కెమెరా ఫోన్లకి పెట్టింది పేరైన చైనా దిగ్గజ మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెనో జ‌డ్‌ను ఈరోజు చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది.

పలు ఆకర్షణీయమైన ఫీచర్ల గల ఈ ఫోన్ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఇక ఇది 6/8 జీబీ ర్యామ్‌ వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ ఫోన్ రూ.25,270 ప్రారంభ ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నారు.

ప‌ర్పుల్‌, జెట్ బ్లాక్‌, వైట్‌, కోర‌ల్ ఆరెంజ్ క‌ల‌ర్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమ‌ర్చారు. ముందు భాగంలోనూ 32 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అందిస్తున్నారు.

ఒప్పో రెనో జ‌డ్ ఫీచ‌ర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి90 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌

128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌

48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డాల్బీ అట్మోస్‌, బ్లూటూత్ 5.0

యూఎస్‌బీ టైప్ సి, 4035 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌

చదవండి: ఐఫాల్క‌న్ నుంచి 65 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ, ధరెంతో తెలుసా?