బిగ్ డిస్‌ప్లేతో భారత మార్కెట్లోకి వచ్చేసిన ‘ఒప్పో ఆర్ 15 ప్రొ’

2:35 pm, Wed, 9 January 19
oppo r15 pro details

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో నుంచి మరో ఫోన్ వచ్చేసింది. ‘ఒప్పో ఆర్15 ప్రొ’ను మార్కెట్లో విడుదల చేసింది. బిగ్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో ఆర్15 ప్రొ ధర వివరాలు…

ఒప్పో ఆర్15 ప్రొ 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర భారత్‌లో రూ. 25,990. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభిస్తుంది. కామిక్ పర్పుల్, రుబీ రెడ్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది.

ఫోన్ ఫీచర్లు ఇవే…

6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఆన్ సెల్ ఓలెడ్ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 128 జీబీ వరకు అంతర్గత మెమొరీని పెంచుకునే వెసులుబాటు, 20+16 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగిన ఈ ఫోన్‌లో 3,430 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీని ఉపయోగించారు.