ఇండియాలో విడుదలైన నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్

5:09 pm, Sat, 8 June 19
2

ఢిల్లీ: చైనా మొబైల్స్ సంస్థలకు ధీటుగా.. హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 2.2ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999 ఉండగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999గా ఉంది.

అయితే ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ ధరల కింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ నెల 11వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

నోకియా 2.2 ఫీచర్లు…

5.71 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే

720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్

400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్

ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

చదవండి: ఐఫాల్క‌న్ నుంచి 65 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీ, ధరెంతో తెలుసా?