సరసమైన ధరల్లో రెడ్‌మి నోట్‌ 7, నోట్‌ 7 ప్రొ

note7pro

న్యూఢిల్లీ: చైనాస్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి తన నోట్‌ సిరీస్‌లో నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ను గురువారం భార‌త మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎట్టకేలకు న్యూఢిల్లీలో ఆవిష్కరించింది. అనూహ్యంగా ప్రారంభ ధర రూ.9999గా ఉంచి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్‌ అమ్మకాలతో రెడ్‌మి నోట్‌ 7 దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
రెడ్‌మి నోట్‌ 7లో 48 మెగా పిక్సెల్‌ భారీ కెమెరాకు బదులుగా ఇండియాలో కేవలం డ్యుయల్‌ రియర్‌ కెమెరాను అమర్చింది. రెండు వైపులా గొరిల్లాగ్లాస్‌ రక్షణ, క్విక్‌ చార్జ్‌ ఫీచర్లు ప్రధాన ఆకర‍్షణగా ఉన్నాయి. బ్లాక్‌, బ్లూ, ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆప్షన్లలో లభించనుంది.

రెడ్‌మి నోట్‌ 7 తొలి ఫ్లాష్‌ సేల్‌…

ఫ్లిప్‌కార్ట్‌, ఎం.ఐకాం ద్వారా మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి

రెడ్‌మి నోట్‌ 7 ఫీచర్లు..

6.3 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్ ప్లే,
1080×2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌,
స్నాప్‌డ్రాగన్‌ 660ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌,
ఆండ్రాయిడ్‌ 9 పై,
3జీబీ, 32 జీబీ స్టోరేజ్‌,
12+2 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా,
13 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ.

3జీబీ/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర : రూ.9999
4జీబీ/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర : రూ. 11,999

దీంతో పాటు దాదాపు ఇదే ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 7 ప్రొను కూడా తీసుకొచ్చింది. అయితే క్వాల‍్కం స్నాప్‌ డ్రాగన్‌ 675 క్రియో ప్రాసెసర్‌ , 48+5 మెగా పిక్సెల్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరాను అమర్చడం విశేషం.

4జీబీ, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర : రూ.13,999
6జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర : రూ.16,999
ఫస్ట్‌ ఫ్లాష్‌ సేల్‌ : ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం ద్వారా మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12గంటలనుంచి