ఈ నెల 15న హానర్ 10 స్మార్ట్‌ఫోన్ విడుదల.. అదే రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు

- Advertisement -

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘హానర్ 10’ను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనుంది. లండన్‌లో జరగనున్న ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. అనంతరం అదే రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభమవుతాయి. హానర్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 5.84 అంగుళాల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ముందు భాగంలోని కెమెరాతో ఫేస్‌ను అన్‌లాక్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇక ఈ ఫోన్‌లో సూపర్ ఫాస్ట్ చార్జ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం చార్జింగ్‌కు కేవలం 25 నిమిషాలే పడుతుంది. హానర్ 10 స్మార్ట్‌ఫోన్ 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానుండగా రూ.27,230, రూ.31,420 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

హానర్ 10 ఫీచర్లు ఇవే…

5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2240 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ హువావే కైరిన్ 970 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

- Advertisement -