అమెరికాను వణికిస్తోన్న ‘మంచు తుపాను’! ఈశాన్య రాష్ట్రాల్లో అంధకారం, విమానాలు రద్దు…

snowfall-in-north-carolina-roads
- Advertisement -

snowfall-in-north-carolina-roads-1

నార్త్ కరోలినా: అమెరికా ఈశాన్య రాష్ట్రాలను మంచు తుపాను వణికిస్తోంది. విపరీతంగా మంచు కురుస్తున్న కారణంగా కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లోని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లు, వీధులు, రహదారులు.. ఇలా ఎటు చూసినా మంచు భారీగా పేరుకపోయింది. ఈ విపరీత ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటికే ఒక వ్యక్తి మృతి చెందాడు.

అంతేకాదు, ఈ మంచు తుపాను కారణంగా సుమారు 3 లక్షల 10 వేల మందికి విధ్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆదివారం భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

నార్త్ కరోలినా, వర్జీనియా, సౌత్ వెస్ట్ వర్జీనియాలో సోమవారం కూడా దాదాపు 5 సెం.మీ. మంచు పడే అవకాశం ఉందని, ఇవే పరిస్థితులు రెండు రోజులపాటు కొనసాగనున్నాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -