బోటు ప్రమాదంలో 14 మంది వరంగల్ వాసులు.. ఐదుగురు సేఫ్.. మిగతా వారి ఆచూకీ గల్లంతు!

- Advertisement -

బోటు ప్రమాదంలో 14 మంది వరంగల్ వాసులు.. ఐదుగురు సేఫ్.. మిగతా వారి ఆచూకీ గల్లంతు!

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనతో వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాపికొండలు చూసేందుకు వెళ్లిన బోటు గోదావరిలో బోల్తా పడింది.

బోటులో మొత్తం 62 మంది ఉండగా ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్టు సమాచారం. మరో 24 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ రక్షించింది. కాగా, బోల్తాపడిన పర్యాటక బోటులో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన మహారాజు కాలనీ వాసులు కూడా ఉన్నారు.

వరంగల్ జిల్లా నుంచి మొత్తం 14 మంది ఉన్నట్టు ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన తర్వాత కడిపికొండ గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. పర్యటనకు వెళ్లినవారి క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు గ్రామస్థులు ఫోన్లు చేశారు. అయితే, ఫోన్లు స్విచ్ఛాప్ వస్తుండడంతో ఆందోళన చెందారు.

ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బోటు ఒక్కసారిగా బోల్తా కొట్టిందని పేర్కొన్నారు. ఆ సమయంలో కొందరు నీళ్లలో దూకారని తెలిపాడు. కొందరు బోటు పైభాగంలో ఎక్కిప్రాణాలు రక్షించుకున్నట్టు వివరించాడు. అదే సమయంలో ఓ బోటు రావడంతో తామంతా సురక్షితంగా బయటపడ్డామన్నాడు. 14 మందిలో ఐదుగురం మాత్రమే సురక్షితంగా ఉన్నామని, మిగతా వారి ఆచూకి తెలియడం లేదని కన్నీరు పెట్టుకున్నాడు.

- Advertisement -