ప్రాణాలతో బయటపడటానికి 220 కి.మీ ఈదిన కుక్కపిల్ల!

To get alive, 220 km pigeon puppy!
- Advertisement -

థాయిలాండ్‌: అది ఓ చిన్న కుక్కపిల్ల. చూడటానికి చాలా అమాయకంగా, ముద్దు ముద్దుగా కనిపిస్తుంది. కాని అది చేసిన సాహసం, దాని పట్టుదల చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. ఈ కుక్కపిల్ల ఎలా వెళ్లిందో తెలియదు గాని సముద్రంలోకి వెళ్లింది. ఒడ్డుకు ఈదాల్సింది పోయి సముద్రం లోపలికి ఈదడం ప్రారంభించింది.

ఎంతకీ ఒడ్డు రాకపోయేసరికి అలా ఈదుతూనే వెళ్లింది. చివరికి సముద్రంలో ఏదో ఒక కట్టడం దానికి కనిపించింది. వెంటనే శక్తినంతా కూడగట్టుకుని అక్కడి దాకా ఈదింది. తీరా చూస్తే అది థాయిలాండ్‌ తీరం నుంచి 220 కిలోమీటర్ల లోపల సముద్రంలో ఉన్న ఆయిల్‌ రిగ్‌ను చేరుకుంది.

అక్కడి నుంచి బయటపడడం ఎలానో తెలియక కొన ఊపిరితో బిక్కు బిక్కుమంటూ చూస్తున్న సమయంలో దానిని ఆ ఆయిల్‌ రిగ్‌లో పనిచేస్తున్న రితిసాక్‌ అనే ఉద్యోగి గమనించారు. కనీసం దాని దగ్గర అరవడానికి కూడా శక్తి లేదనే విషయాన్ని అతడు గ్రహించాడు.

To get alive, 220 km pigeon puppy!నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కుక్కపిల్ల ‘ఆపదలో ఉన్నాను. నన్ను కాపాడండి’ అంటూ తన అమాయకపు కంటి చూపుతో చేస్తున్న అభ్యర్థన అతడికి అర్థమయింది. వెంటనే దానిని రక్షించి నీళ్లు, ఆహారం అందించాడు. అనంతరం దానికి బూన్‌రోడ్‌ అని పేరు పెట్టాడు.

థాయ్‌ భాషలో బూన్‌రోడ్‌ అంటే ‘కర్మను గెలిచి బతికిన వారు’ అని అర్థం. బూన్‌రోడ్‌ చర్మంపై విపరీతంగా గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాపాడిన వ్యక్తే దాని సంరక్షణ చూసుకోవడానికి ముందుకు రావడంతో అందరూ అతణ్ని ప్రశంసలతో ముంచెత్తారు.

- Advertisement -