బోటు ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. రూ.5 లక్షల పరిహారం ప్రకటన

- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పడవ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనలో పలువురు తెలంగాణ వాసులు కూడా గల్లంతయ్యారు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

మంత్రి పువ్వాడ అజయ్‌ను సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పువ్వాడ వెంటనే రాజమండ్రికి బయల్దేరారు.

ఈ ఘటనలో హైదరాబాద్, వరంగల్‌కు చెందిన వారు కూడా ఉండడంతో ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గోదావరి నదిలో ఘోర దుర్ఘటన.. మునిగిన బోటు.. 10 మంది మృతి.. 49 మంది…
బోటు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. కార్యకర్తలకు పిలుపు
బోటు ప్రమాదంలో 14 మంది వరంగల్ వాసులు.. ఐదుగురు సేఫ్.. మిగతా వారి ఆచూకీ…
- Advertisement -