షాకింగ్: సొంత తమ్ముడ్ని చంపి.. మర్మాంగాన్ని కోసి తినేసిన అక్క!

8:52 pm, Sun, 14 April 19
sister-killed-her-brother-and-ate-his-penis

బ్రెజిల్: తల్లి ఇంట్లోలేని సమయంలో ఓ యువతి సొంత తమ్ముడ్నే చంపేసింది.. అంతేకాదు, అతడి శరీరాన్ని ముక్కలు చేయడమేకాక.. అతడి మర్మాంగాన్ని తినేసింది. ఈ ఘోరం బ్రెజిల్‌ దేశంలోని సావో రోక్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఓ మహిళకు 18 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కూతురి పేరు కరీనా, కొడుకు పేరు మేకాన్ రోక్. ఓ రోజు తన కొడుకు మేకాన్‌ను ఇంట్లో వదిలిపెట్టి.. కూతురు ఇంట్లోనే ఉంది కదా.. చూసుకుంటుందిలే అని అనుకుని ఆమె షాపింగ్‌కు వెళ్లింది.

చదవండి: స్నానం చేయడు.. గడ్డం గీయడు.. కాపురమెలా? విడాకుల కోసం కోర్టుకెక్కి భార్య!

ఆమె తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. కూతురు కరీనాను ఎంత పిలిచినా స్పందన కానరాకపోవడంతో ఆమె తన ఇంటి సమీపంలోనే నివసిస్తున్న బంధువులను సహాయం కోసం పిలిచింది.

లోపల గదిలో రక్తపు మడుగులో…

వారు వచ్చి ఇంటికి వెనుకవైపు ఉన్న తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి.. అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యారు. లోపల గదిలో రక్తపు మడుగులో ఐదేళ్ల వయసున్న మేకాన్ రోక్ పడి ఉన్నాడు. పరిశీలించి చూస్తే.. అతడి శరీరం కూడా ముక్కలై ఉంది. అంతేకాదు, అతడి శరీర భాగాల చుట్టూ కొవ్వొత్తులు ఉన్నాయి. ఆ పక్కనే అతడి అక్క కరీనా కూర్చుని ఉంది.

కరీనా ఏదో దారుణం చేసిందని చూడగానే అర్థమైన వారు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా కోపంతో వారిపైకి చేతికందిన వస్తువులు విసిరింది. ఈ ఘటనలో ఆమె మావయ్య కూడా గాయపడ్డాడు.

చదవండి: విచిత్రం: ఓ బిడ్డకు జన్మనిచ్చిన నెలకే మళ్లీ ప్రసవం.. ఈసారి కవలలు!

కరీనా అక్కడ్నించి తప్పించుకునే ప్రయత్నంలో వారి పెంపుడు కుక్క అడ్డురాగా.. దాన్ని కూడా కరిచింది. ఈలోగా సమాచారం అందుకుని వచ్చిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను అదుపులోనికి తీసుకోగలిగారు.

తలగడతో ఊపిరాడకుండా చేసి…

అనంతరం వారు కరీనా గదిని తనిఖీ చేయగా, డ్రగ్స్, కత్తి, కాలిపోయిన సెల్‌ఫోన్, మెమరీ కార్డులు కనిపించాయి. చివరికి కరీనా నిజం కక్కేసింది. తానే తమ్ముడ్ని చంపేశానని ఒప్పుకుంది. ఆడుకుందామని నమ్మించి తమ్ముడ్ని తన బెడ్‌రూ‌మ్‌లోకి తీసుకెళ్లానని, అక్కడ తలగడ అతడి ముఖంపై బలంగా వత్తిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశానని, ఆ తరువాత తమ్ముడి శరీరాన్ని ముక్కలుగా చేసి, అతడి శరీరంలో కొన్ని భాగాలను తాను తినేశానని, అతడి మర్మాంగాన్ని కూడా తిన్నానని తెలిపింది.

చదవండి: 30 ఏళ్లుగా ఇంజిన్ ఆయిల్, టీ.. ఇవే ఇతడి ఆహారం!

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిటెక్టివ్‌లు మేకాన్ రోక్ చేతి మీద కత్తితో పొడిచిన గాయాలు కనిపించడం.. అతడి కనుబొమలు కూడా కుట్టేసి ఉండడం, పాదాలపై కాల్చిన గుర్తులు ఉండడం, అలాగే అతడి మృతదేహం చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి ఉండటాన్ని గమనించి.. బహుశా కరీనా తాంత్రిక విద్యలకు ప్రభావితమై అలా చేసి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు.

బహుశా కరీనాకు సోషల్ నెట్‌వర్క్‌లలో తాంత్రిక విద్యలు అభ్యసించే గ్రూపులతో ఆమెకు సంబంధం ఉండి ఉంటుందని, వారి ప్రోత్సాహంతోనే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉంటుందనే నిర్ణయానికి రాగా.. ఆమె కుటుంబ సభ్యుల కథనం మరోలా ఉంది.

కరీనా చాలా అణుకువ కలిగిన పిల్ల అని, ఎక్కువ సేపు ఒంటరిగానే గడిపేదని, తన తమ్ముడు మేకాన్ రోక్‌ను ఎంతో ప్రేమగా చూసుకునేదని, ఇలా ప్రవర్తించడం తాము తొలిసారిగా చూస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు మాత్రం కరీనాపై హత్య కేసుతోపాటు బంధువులపై దాడి చేసినందుకుగాను హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.