ఛీ..ఛీ..: మెట్రో స్టేషన్‌లో మహిళపై ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

12:00 am, Wed, 19 June 19
woman-harassed-in-gurugram-metro-station

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ మహిళకు చెప్పుకోలేని చేదు అనుభవం ఎదురైంది. మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ ద్వారా స్టేషన్‌లోకి వస్తున్న ఆ మహిళపై ఓ వ్యక్తి హస్తప్రయోగం చేశాడు. అతడి ప్రవర్తనతో ఆమె కంగుతిన్నా వెంటనే తేరుకొని అతని చెంప చెళ్లుమనిపించడమేకాక ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే… ఈనెల 14న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చెందిన ఓ మహిళా ఫ్యాషన్ డిజైనర్ గురుగ్రామ్ మెట్రో స్టేషన్‌లోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన క్లాత్ స్టోర్‌లో పని ముగించుకుని తిరిగి ఎస్కలేటర్ ద్వారా కిందికి దిగుతోంది.

ఆ సమయంలో.. తన వెనక ఎవరో ఏదో చేస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగిన ఆమె ఆ దృశ్యం చూసి షాక్‌కు గురైంది. ఆమె వెనుక నిలబడిన ఓ వ్యక్తి ఆమెపై హస్త ప్రయోగం చేస్తున్నాడు. అంతేకాకుండా తన చేతులతో ఆమె వెనుక భాగాన్ని అసభ్యంగా తాకుతూ అతడు హస్త ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు.

ఇది గమనించగానే ముందు ఆమె భయకంపితురాలైంది. కానీ వెంటనే తేరుకోవడమేకాక గట్టిగా అరుస్తూ.. అతడి చెంప చెళ్లుమనిపించింది. అలాగే చుట్టూ చూస్తూ సహాయం కోసం అరిచింది. కానీ ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ కూడా ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. పైగా సమీపంలో పోలీసులు కూడా ఎవరూ లేరు.

అయినా ఆ మహిళ సరిపెట్టుకోలేదు. అలాంటి నీఛమైన పనికి పాల్పడిన ఆ వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదని నిశ్చయించుకుని వెంటనే ఫేస్‌బుక్ ద్వారా గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో… ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమెను సంప్రదించి సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో సహాయంతో… నిందితుడిని గుర్తించారు. ఈలోగా గురుగ్రామ్ పోలీసులు కూడా స్పందించారు. ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే… నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.