హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రమంతటా 30 వేల యువజన సంఘాలను సంఘటితం చేసి.. వారిని ఒక తాటిపైకి తీసుకువచ్చి.. తెలంగాణ పోరాటంలో నిత్యం వారితో సమావేశాలు, సమాలోచనలు చేసి.. వారిని ఉద్యమబాటలో నిలిపి.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలక భాగస్వామి అయిన జిట్టా బాలకృష్ణా రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన యువ తెలంగాణ పార్టీ(యూటీపీ).. తాజాగా బీజేపీతో కలిసి వ్యూహాత్మకంగా ముందడుగు వేయనుంది.
యువతలో గొప్ప ఫాలొయింగ్, ప్రజల్లో సాఫ్ట్ కార్నర్, రాష్ట్రంలోని యువజన సంఘాలతో సంబంధాలు.. వీటన్నింటినీ ఆధారంగా.. యువ తెలంగాణ పార్టీతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల బరిలో ముందుకు వెళ్లాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు యువత చూపు జిట్టా వైపు…
జిట్టా బాలకృష్ణారెడ్డి కలయికతో ఇప్పుడు బీజేపీలో మరింత చురుకుదనం వచ్చింది. ఇన్నాళ్లూ యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న జిట్టా ఎటువైపు వెళుతున్నారోననే అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అలాగే రాష్ట్రస్థాయిలో పలు నియోజకవర్గాలు, అక్కడి నేతలతో జిట్టాకు ఉన్న పరిచయాలు ఇప్పుడు బీజేపీకి కలిసొచ్చే అంశం.
సాధారణంగా ఎవరైనా నేతలు అటూ, ఇటూ అయితే సాధారణంగానే తీసుకుంటారు. అదే జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి వాళ్లు నిర్ణయాలు తీసుకునే సరికి రాష్ట్రమంతా ఒక చర్చ మొదలైంది. ఈసారి ఆరు నూరైనా జిట్టా గెలుపు ఖాయమనే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.
భువనగిరి నియోజకవర్గ ప్రజలు కూడా ఈసారి జిట్టాకు అవకాశం ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉండటం కలిసి వచ్చే అంశం.. ఎందుకంటే గత పదేళ్లలో భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
ఆనాటి మంచినీటి కష్టాలు తీర్చింది, పోరాడింది.. జిట్టా
అసలు నియోజకవర్గ ప్రజలకు సొంత నిధులో వాటర్ ఫ్లాంట్లు కట్టి నీటి అవసరాలు తీర్చింది, మూసీ ప్రక్షాళన కోసం పాదయాత్రలు చేసింది., మంచినీరు కోసం పోరాడింది.. జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నది చరిత్ర మరువని సత్యం.. ఇది ప్రభుత్వాలు మరిచినా.. నియోజకవర్గ ప్రజలు మరువలేదన్నది నిజం..
నీటి కోసం ఆనాటి జిట్టా ఉద్యమ పాత్ర ఫలితమే.. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇటువైపు రావడానికి కారణం. ఆనాడు ఆ పోరాటం చేసి ఉండకపోతే.. ఈ కాల్వలు.. ఎటు నుంచి ఎటు వెళ్లిపోయేవో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్టుంది: నియోజకవర్గ ప్రజల మాట
ఇన్నాళ్లూ భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం, కాలేజీ, స్కూలు భవనాల నిర్మాణం, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు , పార్కుల అభివృద్ధి.. ఇలా ఆరోజుల్లో సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసిన జిట్టాను కాదనడం, గెలిచినవాళ్లు..చేయాల్సి అభివృద్ధిని పట్టించుకోకపోవడం చూసి..అయ్యో.. సంకలో పిల్లాడిని పెట్టుకొని ఊరంతా తిరిగామే.. ఈసారైనా.. మనల్నే నమ్ముకుని ఉన్న.. మంచి మనసున్న జిట్టాను గెలిపించి.. ఆ రుణం తీర్చుకోవాలనేది నియోజకవర్గ ప్రజల మాట.
ఎలాగైనా దక్షిణాదిన పాగా.. ఇదే బీజేపీ వ్యూహం…
ఎలాగైనా దక్షిణాదిన పాగా వేయాలనేది బీజేపీ వ్యూహం. మొదట్లో కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే టీజేఎస్‌కు ఆఫర్ చేసింది. అయితే కోదండరాం మాత్రం తక్కువ సీట్లిచ్చినా.. కాంగ్రెస్‌తోనే వెళ్లేందుకు ఆసక్తి చూపడంతో బీజేపీ పొత్తు ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో బీజేపీ తనతో కలిసి వచ్చే మిత్రపక్షాల కోసం చూస్తోంది. అందులో భాగంగానే భువనగిరికి చెందిన కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన యువ తెలంగాణ పార్టీతో జతకట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే యువత తెలంగాణ పార్టీ నేతలు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపారు.
భువనగిరి నుంచి జిట్టా, నర్సంపేట నుంచి రాణి రుద్రమ…
యువ తెలంగాణ పార్టీ తమతో కలిసి పనిచేయాలని నిర్ణయించడం శుభసూచికమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ, యువ తెలంగాణ పార్టీ పొత్తుల్లో భాగంగా యువ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి నుంచి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణి రుద్రమ వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.