కరోనా సెకండ్ వేవ్: తెలంగాణలోనూ 24 గంటల్లో 8,061 పాజిటివ్ కేసులు, 56 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 8,061 పాజిటివ్ కేసులు నమోదుకాగా మరో 56 మంది మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,19,966కి చేరుకోగా.. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2,150కి చేరుకుంది.

జీహెచ్ఎంసీలోనే అత్యధిక కేసులు…

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,133 క్రియాశీల కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 82,270 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 1,508 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదుకావడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని ఈ గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి.

చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ‘కరోనా’ ఉద్ధృతి.. 24 గంటల్లో 11,434 పాజిటివ్ కేసులు