టీఆర్ఎస్ ఓడిపోతే నాకేమీ కాదు, తెలంగాణ ప్రజలకే నష్టం: నిర్మల్ సభలో కేసీఆర్

trs chief kcr appeals to give 17 mp seats in telangana
- Advertisement -

kcr-in-nirmal-meeting

నిర్మల్‌ : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే తనకు పెద్దగా వచ్చే  నష్టమేమీ లేదని, తెలంగాణ ప్రజలే తీవ్రంగా నష్టపోతారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అంతేకాదు, తెలంగాణపై చంద్రబాబు పెత్తనం వస్తే  ఎవరికి లాభం అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ చిల్లర రాజకీయం కోసం చంద్రబాబునాయుడ్ని తెచ్చుకొంటున్నారంటూ మండిపడ్డారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖనాపూర్‌లో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అభివృద్ధి వెనక్కి పోతుందని, తెలంగాణ అంధకారమవుతుందని చెప్పారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ తెలంగాణను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

చంద్రబాబును నేను తరిమేశా.. ఈసారి బాధ్యత మీది…

కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబును తీసుకొచ్చి ప్రజల నెత్తిమీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని, అంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దరఖాస్తులు పట్టుకొని విజయవాడకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఒకసారి చంద్రబాబును తాను తెలంగాణ నుంచి తరిమేశానని, ఈ సారి మాత్రం ఆ బాధ్యత తెలంగాణ ప్రజలే తీసుకోవాలని సూచించారు.

టీఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణ సంపద పెరిగిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేందుకు కృషి చేశామని, మళ్లీ అధికారంలోకి రాగానే  రైతులకు రూ. లక్ష రుణ మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. విపక్ష నేతల అబద్దపు ప్రచారం నమ్మవద్దని సూచించారు. మంచి వ్యక్తులనే ఎన్నికల్లో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

- Advertisement -