హైదరాబాద్‌లో మూడ్రోజులు ‘మద్యం’ బంద్!

hyd-wine-shop
- Advertisement -

hyd-wine-shopహైదరాబాద్‌: భాగ్యనగరంలో మూడు రోజులు పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. జులై 29 ఉదయం 6 గంటల నుంచి జులై 31 వరకు నగరంలో శ్రీ ఉజ్జయిని మహాంకాళి జాతర వేడుకలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. స్టార్ హోటళ్లలోని బార్‌లు, క్లబ్‌లకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు.

పోలీసుల ఆదేశాల మేరకు మధ్య మండలం, ఉత్తర మండలంలోని చిలకలగూడ, గోపాలపురం, లాలాగూడ, మహంకాళి, తుకారాంగేట్, కార్ఖానా, మారేడ్‌పల్లి, బేగంపేట్, రాంగోపాల్‌పేట్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఆదివారం నుంచి మూతపడనున్నాయి.

- Advertisement -