ప్రపంచ సినీ చరిత్రలో ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ కొత్త రికార్డ్ సృష్టిస్తుందా?

Avengers-End-Game
- Advertisement -

హాలీవుడ్ :ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ భారీ అంచనాల మధ్య ఈ నెల 26 న విడుదల కాబోతుంది.ఒక హాలీవుడ్ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ లో విడుదల కావడం ఇదే తొలిసారి. దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అవెంజర్స్ సందడి మొదలైంది. దీనితో ఈ ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ 3 బిలియన్ డాలర్లు, అంటే అక్షరాలా రూ.20 వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఒక సినిమా ఇంత వసూళ్లు సాధిస్తుందని అంటే నమ్మశక్యంగా లేదు. కానీ ఈ శుక్రవారం రాబోతున్న ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ సినిమా ఆ మైలురాయిని అందుకుంటుందని ప్రపంచ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 3 బిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిన తొలి సినిమాగా ఎండ్ గేమ్ చరిత్ర సృష్టిస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విపరీతమైన హైప్ మధ్య సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టీ దీని మీదే ఉంది. ఇంతకుముందు ఎవెంజర్స్ సిరీస్‌లో వచ్చిన ఇన్ఫినిటీ వార్ ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించాయి.

ఆ తరువాత జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం అవతార్ సినిమా 2.7 బిలియన్ డాలర్లు అంటే రూ.18,800 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధికమైన కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నేటికీ అవతార్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

అవతార్ రికార్డుల్ని ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ కచ్చితంగా బద్దలు కొడుతుందన్న అంచనాలు ఉన్నాయి. అవతార్ కు ఏమాత్రం తగ్గని స్తాయిలో క్రేజ్ ఉండగా, ఇప్పుడు టికెట్ల రేట్లు పెరిగాయి కాబట్టి ఆ వసూళ్లని అవెంజర్స్ ది ఎండ్ గేమ్ ఈజీ గా దాటి , తొలి 3 బిలియన్ డాలర్ల సినిమాగా ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్ నిలవడం ఖాయం అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -