తెలంగాణలో నేడు 8వేలకు చేరువైన కొత్త కేసులు.. 58 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణలో క‌రోనా విజృంభణ కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 7,994 మంది కరోనా బారినపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ ఉదయం బులెటిన్ విడుదల చేసింది.

అలాగే, ఒక్క‌రోజులో కరోనాతో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 4,009 మంది వైరస్ కోరల నుంచి బయటపడ్డారు.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,960కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,49,692 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,208గా ఉంది.

తెలంగాణలో ప్రస్తుతం 76,060 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,630 మందికి క‌రోనా సోకింది.