తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018: జిల్లాల వారీగా విజేతల వివరాలు…

2:05 pm, Thu, 3 January 19

telangana-assembly-elections-results

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అత్యధికంగా 88 స్థానాలు సాధించి.. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ప్రజాకూటమి 21 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. బీజేపీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోగా, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలోని 119 స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు.. మీకోసం…

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల సంఖ్య: 119
2018 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య: 1821
మొత్తం పోలింగ్ శాతం: 73.2
మొత్తం కౌంటింగ్ కేంద్రాలు: 43

అధికారం సాధించేందుకు కావల్సిన సీట్లు: 60

ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే…

పార్టీ గెలుపొందిన స్థానాలు
టీఆర్ఎస్ 88
కాంగ్రెస్ 19
టీడీపీ 2
టీజేఎస్ 0
సీపీఐ 0
బీజేపీ 1
ఎంఐఎం 7
ఇతరులు 2

 

జిల్లాలవారీగా విజేతల వివరాలు:

హైదరాబాద్:
చార్మినార్ – ముంతాజ్ అహ్మద్ ఖాన్ (మజ్లిస్)
చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ (మజ్లిస్)
యాకుత్‌పురా – పాషా ఖాద్రీ (మజ్లిస్)
బహదూర్ పురా – మోజంఖాన్ (మజ్లిస్)
మలక్‌పేట – అహ్మద్ బలాల (మజ్లిస్)
నాంపల్లి – జఫర్ హుస్సేన్ (మజ్లిస్)
కార్వాన్ – కౌసర్ మొహయుద్దీన్ (మజ్లిస్)
ముషీరాబాద్ – ముఠా గోపాల్ (టీఆర్‌ఎస్)
అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్ (టీఆర్‌ఎస్)
ఖైరతాబాద్ – దానం నాగేందర్ (టీఆర్‌ఎస్)
జూబ్లీహిల్స్ – మాగంటి గోపినాథ్ (టీఆర్‌ఎస్)
సనత్‌నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీఆర్‌ఎస్)
గోషామహల్ – రాజా సింగ్ (బీజేపీ)
సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్ (టీఆర్‌ఎస్)
కంటోన్మెంట్ – సాయన్న (టీఆర్‌ఎస్)

రంగారెడ్డి:
మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి (టీఆర్‌ఎస్)
మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంత్ రావు (టీఆర్‌ఎస్)
కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు (టీఆర్‌ఎస్)
ఉప్పల్ – బేతీ సుభాష్ రెడ్డి (టీఆర్‌ఎస్)
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి (టీఆర్ఎస్)
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానందబ (టీఆర్ఎస్)
రాజేంద్రనగర్ – టి. ప్రకాశ్ గౌడ్ (టీఆర్‌ఎస్)
శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ (టీఆర్‌ఎస్)
చేవెళ్ల – కాలే యాదయ్య (టీఆర్‌ఎస్)
పరిగి – కొప్పుల మహేశ్ రెడ్డి (టీఆర్‌ఎస్)
వికారాబాద్ – మెతుకు ఆనంద్ (టీఆర్‌ఎస్)
తాండూర్ – పి. పైలట్ రోహిత్ రెడ్డి (కాంగ్రెస్)
ఎల్బీనగర్ – సుధీర్‌రెడ్డి (కాంగ్రెస్)
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి (కాంగ్రెస్)

మెదక్:
సిద్దిపేట – హరీశ్ రావు (టీఆర్‌ఎస్)
మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి (టీఆర్‌ఎస్)
ఆందోల్ – క్రాంతి కిరణ్ (టీఆర్‌ఎస్)
నర్సాపూర్ – మదన్ రెడ్డి (టీఆర్‌ఎస్)
జహీరాబాద్ – కే మాణిక్ రావు (టీఆర్‌ఎస్)
పటాన్‌చెరు – గూడెం మహిపాల్ రెడ్డి (టీఆర్‌ఎస్)
దుబ్బాక – సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్‌ఎస్)
గజ్వేల్ – కేసీఆర్ (టీఆర్‌ఎస్)
సంగారెడ్డి – జగ్గారెడ్డి (కాంగ్రెస్)

మహబూబ్‌నగర్:
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్)
కొడంగల్ – పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
నారాయణపేట – రాజేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
మహబూబ్‌నగర్ – శ్రీనివాస్ గౌడ్ (టీఆర్‌ఎస్)
జడ్చర్ల – సీహెచ్ లక్ష్మారెడ్డి (టీఆర్‌ఎస్)
దేవరకద్ర – ఆల వెంకటేశ్వరరెడ్డి (టీఆర్‌ఎస్)
మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి (టీఆర్‌ఎస్)
వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (టీఆర్‌ఎ)
గద్వాల – బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (టీఆర్‌ఎస్)
అలంపూర్ – వీఎం అబ్రహాం (టీఆర్‌ఎస్)
నాగర్‌కర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి (టీఆర్‌ఎస్)
అచ్చంపేట – గువ్వల బాలరాజు (టీఆర్‌ఎస్)
కల్వకుర్తి – జైపాల్ యాదవ్ (టీఆర్‌ఎస్)
షాద్‌నగర్ – అంజయ్య యాదవ్ (టీఆర్‌ఎస్)

నల్లగొండ:
దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్ (టీఆర్‌ఎస్)
నాగార్జునసాగర్ – నోముల నర్సింహయ్య (టీఆర్‌ఎస్)
మిర్యాలగూడ – ఎన్ భాస్కర్ రావు (టీఆర్‌ఎస్)
కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్ (టీఆర్‌ఎస్)
సూర్యాపేట – జి. జగదీశ్ రెడ్డి (టీఆర్‌ఎస్)
నల్లగొండ – కంచర్ల భూపాల్ రెడ్డి (టీఆర్‌ఎస్)
భువనగిరి – పైళ్ల శేఖర్ రెడ్డి (టీఆర్‌ఎస్)
తుంగతుర్తి – గ్యాదరి కిశోర్ (టీఆర్‌ఎస్)
ఆలేరు – గొంగిడి సునీత (టీఆర్‌ఎస్)
మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్)
హుజుర్‌నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్)

ఖమ్మం:
సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ)
అశ్వరావుపేట – మచ్చా నాగేశ్వర్‌రావు (టీడీపీ)
పినపాక – రేగా కాంతరావు (కాంగ్రెస్)
భద్రాచలం – పాడేం వీరయ్య (కాంగ్రెస్)
కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర్‌రావు (కాంగ్రెస్)
ఇల్లందు – బానోత్ హరిప్రియ నాయక్ (కాంగ్రెస్)
పాలేరు – కందాల ఉపేందర్ రెడ్డి (కాంగ్రెస్)
మధిర – మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్)
వైరా – రాములు నాయక్(స్వతంత్ర అభ్యర్థి)
ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్ (టీఆర్‌ఎస్)

ఆదిలాబాద్:
ఆసిఫాబాద్ – అత్రం సక్కు (కాంగ్రెస్)
సిర్పూర్ – కోనేరు కొనప్ప (టీఆర్‌ఎస్)
చెన్నూర్ – బాల్క సుమన్ (టీఆర్‌ఎస్)
బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య (టీఆర్‌ఎస్)
మంచిర్యాల – నడిపెల్లి దివాకర్ రావు (టీఆర్‌ఎస్)
ఖానాపూర్ – రేఖా నాయక్ (టీఆర్‌ఎస్)
ఆదిలాబాద్ – జోగు రామన్న (టీఆర్‌ఎస్)
బోథ్ – రాథోడ్ బాపూరావు (టీఆర్‌ఎస్)
నిర్మల్ – అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి (టీఆర్‌ఎస్)
ముథోల్ – జి. విఠల్ రెడ్డి (టీఆర్‌ఎస్)

వరంగల్:
ములుగు – సీతక్క (కాంగ్రెస్)
జనగామ – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (టీఆర్‌ఎస్)
స్టేషన్ ఘన్‌పూర్ – టి. రాజయ్య (టీఆర్‌ఎస్)
పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు (టీఆర్‌ఎస్)
డోర్నకల్ – రెడ్యా నాయక్ (టీఆర్‌ఎస్)
మహబూబాబాద్ – బానోత్ శంకర్ నాయక్ (టీఆర్‌ఎస్)
నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి (టీఆర్‌ఎస్)
పరకాల – చల్లా ధర్మారెడ్డి (టీఆర్‌ఎస్)
వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్ (టీఆర్‌ఎస్)
వరంగల్ తూర్పు – నన్నపనేని నరేందర్ (టీఆర్‌ఎస్)
వర్ధన్నపేట – ఆరూరి రమేశ్ (టీఆర్‌ఎస్)
భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి (టీఆర్‌ఎస్)

నిజామాబాద్:
ఆర్మూర్ – జీవన్ రెడ్డి (టీఆర్‌ఎస్)
బోధన్ – షకీల్ అహ్మద్ (టీఆర్‌ఎస్)
జుక్కల్ – హన్మంత్ షిండే (టీఆర్‌ఎస్)
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి (టీఆర్‌ఎస్)
ఎల్లారెడ్డి – జాజల సురేందర్ (కాంగ్రెస్)
కామారెడ్డి – గంప గోవర్ధన్ (టీఆర్‌ఎస్)
నిజామాబాద్ – బిగాల గణేశ్ గుప్తా (టీఆర్‌ఎస్)
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్‌ఎస్)
బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి (టీఆర్‌ఎస్)

కరీంనగర్:
కోరుట్ల – కే విద్యాసాగర్ రావు (టీఆర్‌ఎస్)
జగిత్యాల – డాక్టర్ సంజయ్ కుమార్ (టీఆర్‌ఎస్)
ధర్మపురి – కొప్పుల ఈశ్వర్(టీఆర్‌ఎస్)
రామగుండం – కె.చందర్ (స్వతంత్ర అభ్యర్థి)
మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్)
పెద్దపల్లి – దాసరి మనోహర్‌రెడ్డి (టీఆర్‌ఎస్)
కరీంనగర్ – గంగుల కమలాకర్ (టీఆర్‌ఎస్)
చొప్పదండి – సుంకే రవిశంకర్ (టీఆర్‌ఎస్)
వేములవాడ – చెన్నమనేని రమేశ్ (టీఆర్‌ఎస్)
సిరిసిల్ల – కేటీఆర్ (టీఆర్‌ఎస్)
మానకొండూరు – రసమయి బాలకిషన్ (టీఆర్‌ఎస్)
హుజురాబాద్ – ఈటల రాజేందర్ (టీఆర్‌ఎస్)
హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్ (టీఆర్‌ఎస్)