ఏపీ సీఎస్ సమీక్ష పై యనమల ఫైర్!

- Advertisement -

అమరావతి: రాష్ట్రంలో వివిధ పథకాలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించడాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. పేదల పథకాలకు నిధుల విడుదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించడంపై యనమల మండిపడ్డారు.

చదవండి: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఏమన్నాడో చూడండి..!

కొన్ని పథకాలకు బడ్జెట్‌లో నిధులు లేవని సీఎస్ పేర్కొన్నారని యనమల తెలిపారు. సీఎస్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పసుపు – కుంకుమ, పింఛన్లు, రైతుల పెట్టుబడి సాయానికి బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేశామని చెప్పారు.

అన్నదాత సుఖీభకు రూ.5000 కోట్లు, పసుపు-కుంకుమకు రూ.4000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని యనమల తెలిపారు. పింఛన్ల కేటాయింపును బడ్జెట్‌లో స్పష్టంగా పేర్కొన్నామని వివరించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాకముందే రైతులకు, మహిళలకు చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు.

బడ్జెట్లో ఉన్న ఈ పథకాలు ఎన్నికల కోడ్‌ కిందికి రావని యనమల తెలిపారు. ఇప్పటికే కోర్టులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిన అంశాన్ని గుర్తు చేశారు. అలాంటి పథకాలపై ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించడం సరికాదన్నారు.

చదవండి: ap బిగ్ ఫైట్: లేటెస్ట్ సర్వే ! వైసీపీ – టీడీపీ మధ్య తేడా…

- Advertisement -