యుద్ధంలో సైనికులకు ఇబ్బందులా?.. డాక్టర్ల జీతాల కోతపై సుప్రీం

- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా సమయంలో ప్రాణాలొడ్డి పోరాడుతున్న డాక్టర్ల జీతాలపై కోతలు విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. డాక్టర్ల జీతాల్లో కోతలు విధించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడింది.

ఈ సమస్యపై వెంటనే దృష్టిసారించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసింది. ‘కరోనాకు వ్యతిరేకంగా ఇప్పుడు ఓ యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సైనికులను అసంతృప్తికి గురిచేయకూడదు’ అంటూ వ్యాఖ్యలు చేసింది.

కొంచెం కష్టమైనా ఏదో విధంగా ప్రయత్నించి, డాక్టర్ల కోసం బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో డాక్టర్ల వేతనాలు తగ్గిస్తే, వారిలో పనిచేయాలనే తపన తగ్గిపోతుందంటూ కొందరు వాదిస్తున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.

- Advertisement -