‘విక్రముడి’ ఆచూకీ దొరికింది: ఇస్రో తాజా ప్రకటన

12:26 pm, Tue, 10 September 19

హైద‌రాబాద్‌: చంద్రుడి ఉప‌రిత‌లంపై కూలిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను గుర్తించిన‌ట్లు ఇస్రో నేడు వెల్ల‌డించింది. ఇస్రో త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పేర్కొంది.

చంద్ర‌యాన్-‌2కు చెందిన ఆర్బిటర్‌.. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు తెలిపింది. కానీ విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో ఎటువంటి క‌మ్యూనికేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని చెప్పింది. ల్యాండ‌ర్‌తో క‌మ్యూనికేష‌న్ ఏర్ప‌రిచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు పేర్కొంది.

ఈ నెల 7న రాత్రి 1.51 నిమిషాల స‌మ‌యంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగుతూ సిగ్నల్స్ కోల్పోయింది. ల్యాండ‌ర్ వెలాసిటీ అదుపుత‌ప్ప‌డంతో స్టాఫ్ ల్యాండింగ్ కాలేదు. దీంతో ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ నిలిచిపోయాయి.