నటుడు కాదు ఉన్మాది… జ్యోతిష్యురాలిపై ఆత్యాచారం చేసి… ఆపై వీడియో తీసి..

TV actor and singer Karan Oberoi arrested for raping, blackmailing woman
- Advertisement -

ముంబై: అందరి జాతకాలు చెప్పే జ్యోతిష్యురాలు తన జాతకం చూసుకోలేదేమో.. ఓ నటుడి చేతిలో మోసపోయి పోలీసులని ఆశ్రయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమ పేరుతో దగ్గరవడం, పెళ్లి పేరుతో లొంగదీసుకుని మోసం చేయడం నేటి యువతకు ఫ్యాషన్‌ అయిపోయింది. ఇక ఇటువంటి వాటిల్లో నటీ- నటులేం అతీతం కాదు. నిజానికి ఇలాంటివి ఈ రంగంలోనే ఎక్కువ జరుగుతాయి కానీ ఎక్కువగా బయటకి రావు.

అసలు ఏం జరిగిందంటే?

ఇక వివరాల్లోకి వెళితే.. అతనొక బాలీవుడ్ బుల్లి తెర నటుడు, మోడల్. సాయా, జస్సి, జైసీ కోయి నహీ, ఇన్‌సైడ్ ఎడ్జ్ వంటి టీవీ కార్యక్రమాల ద్వారా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. అతనే కరణ్ ఒబెరాయ్‌.

చదవండిహాజీపూర్ హత్యాచారాలు: సైకో శ్రీనివాస్ రెడ్డికి.. మరికొందరి సహకారం!?

అందరితో సరదాగా మాట్లాడటం, పరిచయం పెంచుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలాగే ఓ జ్యోతిష్కురాలితో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని కల్లబుల్లి మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.

అక్కడితో ఆగకుండా దానిని కెమెరాలో బంధించాడు. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. అడిగినంత ఇవ్వకుంటే ఆ వీడియోని అందరికీ చూపిస్తానని బెదిరించడంతో గత్యంతరం లేక ఆ జ్యోతిష్కురాలు ముంబైలోని ఓషివా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఇక పోలీసులు ఈరోజే కరణ్‌ను అంధేరి కోర్టులో హాజరుపరాచనున్నారు.

కేవలం బుల్లితెర నటుడిగానే కాకుండా.. ఫ్యాషన్ ఫిట్‌నెస్ మోడల్‌గా అందరికీ సుపరిచితుడైన కరణ్ ఇటువంటి దారుణానికి పాల్పడటంతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు.

చదవండి: భార్యపై దాడి చేసిన భర్త.. తల్లి, చెల్లిని పిలిచి భర్తను చంపేసిన భార్య
- Advertisement -