హెల్మెట్ ధరించని ట్రాఫిక్ కానిస్టేబుల్.. రూ.34 వేల జరిమానా

10:06 am, Sat, 7 September 19

రాంచీ (జార్ఖండ్): ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు చట్టం నుంచి తప్పించుకోవడం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌కూ సాధ్యం కాలేదు.

హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతూ పట్టుబడిన అతడికి అధికారులు ఏకంగా రూ.34 వేల జరిమానా విధించారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఈ ఘటన జరిగింది.

హెల్మెట్ ధరించకుండా పట్టుబడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాకేశ్ కుమార్ ఈ జరిమానాకు గురయ్యాడు. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారమే జరిమానా విధించినట్టు ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

హెల్మెట్ ధరించకోవడంతోపాటు ఇతర నిబంధనలను కూడా రాకేశ్ ఉల్లంఘించాడని, కొత్త చట్టం ప్రకారం రెండింతల జరిమానా విధించామని అధికారులు పేర్కొన్నారు.