బీజేపీ మేనిఫెస్టోలోని హైలెట్స్ ఇవే!

- Advertisement -

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో(సంకల్ప్ పత్ర)ను సోమవారం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, అయోధ్యలో రాం మందిర్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, రైతుల ఆర్థిక ప్రగతికి మేనిఫోస్టోలో ప్రాధాన్యత కల్పించారు.

75 లక్ష్యాలు, 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని 2022 వరకు 75 లక్ష్యాలను పెట్టుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. దేశంలోని 6 కోట్ల మంది ప్రజల అభిప్రాాయాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు చెప్పారు.

రామ మందిరం నిర్మాణానికి బీజేపీ హామీ..

రైతులకు వడ్డీ రహిత రుణాలు, రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ కల్పించనున్నారు. రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులపై లక్ష రూపాయల వరకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ కల్పిస్తారు.

రైతులకు సంవత్సరానికి రూ.6000 సాయం, దేశంలోని రైతులకు సంవత్సరానికి రూ.6 వేల సాయం. రెండు హెక్టార్లకు పైబడిన రైతులకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తింపు. 60 ఏళ్లు దాటిన చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ పథకం అమలు.

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం, జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణ, సైనికుల సంక్షేమానికి పెద్దపీట. జమ్మూకాశ్మీర్‌లో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రయత్నాలు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం, జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణ, సైనికుల సంక్షేమానికి పెద్దపీట. రాజ్యాంగానికి లోబడి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ

దేశ శ్రేయస్సు కోసం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ.
వ్యవసాయ గ్రామీణ రంగానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి. ప్రధానమంత్రి ఫసల్ భీమో యోజన కింద అందరికీ భీమా వర్తింపు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా.

- Advertisement -