’#MeToo’ పిటిషన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు..!

supreme-court
- Advertisement -

supreme-court

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘#మీటూ’ ఉద్యమానికి సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. #మీటూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాల్సిందిగా న్యాయవాది ఎమ్‌.ఎల్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

ఈ ప్రజా ప్రయోజనం వ్యాజ్యాన్ని అత్యవసర విచారణగా భావించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన​ గగోయ్‌, ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మసనం వ్యాఖ్యానించింది.

ప్రకంపనలు సృష్టిస్తున్నప్రముఖులపై లైంగిక ఆరోపణల అంశాలపై వెంటనే విచారణ జరిపి, ఫిర్యాదు చేసిన మహిళలకు జాతీయ మహిళా కమిషన్‌ ద్వారా రక్షణ కల్పించాలని పిటిషనర్‌ ఇటీవల సుప్రీంకోర్టును కోరారు.

పని ప్రదేశాల్లో…

పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్నలైంగిక వేధింపులను అరికట్టేందుకు లైంగిక వేధింపుల నిరోధక​ చట్టం (2013) ప్రకారం పని ప్రదేశాల్లో ఇంటర్నల్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని జాతీయ మహిళా కమిషన్‌ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల నటి తనుశ్రీ.. గతంలో నానా పటేకర్‌ తనని లైంగిక వేధింపులకు గురిచేశారంటూ సంచలన ఆరోపణలకు తెరతీసిన విషయం తెలిసిందే.

పలువురు ప్రముఖులపై ఆరోపలలు…

అంతటితో ఆగని ఈ ఆరోపణలు చివరికి కేంద్రమంత్రి ఎంజే అక్బర్‌ రాజీనామా వరకు వచ్చాయి.  బాలీవుడ్‌ దిగ్గజాలు నానా పటేకర్‌తో పాటు సుభాష్‌ ఘాయ్‌, సాజిద్‌ ఖాన్‌, రజత్‌ కపూర్‌, వికాస్‌ బహల్‌  ఇంకా క్యాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానా,  రచయిత వైరముత్తు సహా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం పెను సంచలనాన్ని స‌ృష్టించింది.

#మీటూపై దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో సాధారణ పిటిషన్లతోపాటు షెడ్యూల్‌ ప్రకారం దీనిని కూడా విచారించనుంది.

 

- Advertisement -