ఇస్రో శాస్త్రవేత్తలకు భారీ షాకిచ్చిన కేంద్రం.. ఉద్యోగుల్లో ఆవేదన

- Advertisement -

న్యూఢిల్లీ: ఇస్రో శాస్త్రవేత్తలకు కేంద్రం భారీ షాకిచ్చింది. అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న సీనియర్ స్టాఫ్, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది.

ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు అడిషనల్ ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో వారి జీతాల్లో కోత పడింది. జూన్ 12న ఇందుకు సంబంధించిన జీవోను కేంద్రం విడుదల చేయగా, జూలై 1 నుంచి కొత్త జీతాల్లో అమల్లోకి వచ్చాయి.

కేంద్రం తీసుకున్న నిర్ణయ ప్రభావం ఇస్రోలోని 90 మంది శాస్త్రవేత్తలు, ఉద్యోగులపై పడగా, సగటున రూ.10 వేల వరకు వారి జీతాల్లో కోత పడినట్టు అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం 1996లో ఎస్‌డీ స్థాయి నుంచి ఎస్‌జీ స్థాయి ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. దీనిని ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వెనక్కి తీసుకుంది.

మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని ఇస్రోలోని స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. ఇస్రో చైర్మన్‌ శివన్‌ను కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకులా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో చివరి క్షణాల్లో అవాంతరాలు వచ్చాయి. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే సమయంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి.

అయితే, విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతాన్ని తర్వాత ఇస్రో గుర్తించింది. అది చంద్రయాన్-2 కక్ష్యలోనే ఉన్నట్టు ప్రకటించిన ఇస్రో.. విక్రమ్ ల్యాండర్‌తో సమాచార పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -