#MeToo: లైంగిక ఆరోపణలపై స్పందించిన నానాపటేకర్‌.. తనుశ్రీపై చట్టపరమైన చర్యలు…

nana patekar
- Advertisement -

nana patekar

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు దేశం వ్యాప్తంగా #MeToo ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మౌనంగానే ఉన్న నానా పాటేకర్‌ తాజాగా ఈ ఆరోపణలపై  పెదవి విప్పారు.  ‘‘ఎప్పుడో ఏదో జరిగిందని తనుశ్రీ దత్తా కట్టుకథ అల్లి చెప్పింది. అవి అవాస్తవాలు, పూర్తిగా నిరాధారమైన తప్పుడు ఆరోపణలు. ఆమెపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను..’’ అని వివరణ ఇచ్చారు.

అప్పట్లో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా నానా పటేకర్‌ తనపట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారంటూ బాలీవుడ్‌ బ్యూటీ తనుశ్రీ దత్తా గతంలో ఆరోపించింది. ఈ ఆరోపణలపై తనుశ్రీకి శిల్పాశెట్టి, డింపుల్‌ కపాడియా, పరిణితి చోప్రా, ప్రియాంక చోప్రా, ట్వింకిల్‌ ఖన్నా, ఫర్హాన్‌ అక్తర్‌ మద్దతుగా నిలిచారు కూడా.

మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సినిమా అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సీఐఎన్‌టీఏఏ).. నానా పటేకర్‌కు  నోటీసులు పంపించింది. ఈ నోటీసులకు వివరణ పంపిన నానా పటేకర్‌ తనుశ్రీవి తప్పుడు ఆరోపణలుగా పేర్కొంటూ లీగల్‌ నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా, తనుశ్రీ దత్తా ఆరోపణలపై సీఐఎన్‌టీఏఏ ఇచ్చిన నోటీసులకు స్పందించిన నానా పటేకర్‌ తనుశ్రీ దత్తా తనపై చేసిన ఆరోపణలన్నీ  నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆమె చేసిన ఆరోపణలపై తాను చట్టపరమైన చర్యలు తీసుకునే పనిలో ఉన్నానని ఆ వివరణలో వెల్లడించారు. ఆయన వివరణపై సీఐఎన్‌టీఏఏ ఏ విధంగా స్పందిస్తుదనేది చూడాలి.

- Advertisement -