లక్నో : దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా యూపీలో దారుణం చోటుచేసుకుంది. మిలాక్ గ్రామనికి చెందిన ఓ యువకుడు తన రాక్షసానందం కోసం మూడేళ్ల చిన్నారిని బలిపెట్టాడు. ఆ చిన్నారి నోట్లో వంకాయ బాంబు పెట్టి పేల్చాడంతో.. ఆ బాంబు దాటికి ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతుంది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లా మిలాక్ గ్రామనికి చెందిన బాలిక(3) తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన హర్పాల్ అనే యువకుడు అటుగా వెళుతూ ఆ బాలికను తనతో పాటు తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో హర్పాల్ తన దగ్గర ఉన్న సుతిల్ బాంబు చిన్నారి నోట్లో పెట్టి అంటించాడు. ఆ బాంబు ఆ చిన్నారి నోట్లో పేలిపోవడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆ బాలికను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.