లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు ఇవే.. వెల్లడించిన కేంద్రం, హాట్‌స్పాట్‌లలో ఆంక్షలు మరింత కఠినం…

PM Modi on Lockdown 4.0
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు ముకుతాడు వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.

మే 31 వరకూ మెట్రో, విమాన సేవలు అందుబాటులో ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా హాట్‌స్పాట్స్‌లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

చదవండి: మే 31 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు, రాత్రిపూట కర్ఫ్యూ యధాతథం…

పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు కూడా ఈ నెలాఖరు వరకు మూసివేసే ఉంటాయని తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ తెరిచేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పింది.

సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియాలు, అసెంబ్లీహాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు  కూడా లాక్‌డౌన్ కాలంలో  తెరిచే పరిస్థితి లేదని పేర్కొంది.

మే 31 వరకూ ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. అయితే, కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై రాష్ట్రాలదే అధికారం అని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్రాల పరస్పర అనుమతితో ప్రజారవాణా వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.

రెస్టారెంట్లకు హోం డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

చదవండి: నిజ జీవితంలోనూ నాకు వస్త్రాపహరణం జరిగింది: ‘టీవీ ద్రౌపది’ రూపా గంగూలీ
- Advertisement -