మాజీ ప్రధాని వాజ్‌పేయి జీవితంలో ముఖ్య సంఘటనలు

vajpayee
- Advertisement -

vajpayee

అలుపెరుగని రాజకీయ యోధుడు వాజ్‌పేయీకి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది.  1998లో రెండోసారి ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు.

ఆ తరువాత  అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు.  ఆయన దేశానికి చేసిన విశేష సేవలకుగానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.  ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను ‘సుపరిపాలనా దినం’గా ప్రకటించింది. వాజ్‌పేయీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ 2015 మార్చి 27 న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్‌పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలి వచ్చారు.

అవార్డులు

1992, పద్మవిభూషణ్
1993, కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం
1994, లోకమాన్య తిలక్ పురస్కారం
1994, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
1994, భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు
2014 : భారతరత్న

నిర్వహించిన పదవులు

1951 – వ్యవస్థాపక సభ్యుడు, భారతీయ జనసంఘ్
1957 – రెండవ లోక్‌సభకు ఎన్నిక
1957–77 – నాయకుడు, భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ
1962 – సభ్యుడు, రాజ్యసభ
1966-67- ఛైర్మన్, ప్రభుత్వ అస్సూరెన్స్ కమిటీ
1967 – నాలుగవ లోక్‌సభకు మరలా ఎన్నిక (రెండవ సారి)
1967–70 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
1968–73 – అధ్యక్షుడు, భారతీయ జనసంఘ్
1971 – ఐదవ లోక్‌సభకు ఎన్నిక. (మూడవ సారి)
1977 – ఆరవ లోక్‌సభకు ఎన్నిక (నాలుగవ సారి)
1977–79 – కేంద్ర కేబినెట్ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ
1977–80 – వ్యవస్థాపక సభ్యుడు, జనతాపార్టీ
1980 – ఏడవ లోక్‌సభకు ఎన్నిక ( ఐదవ సారి)
1980-86- అధ్యక్షుడు, భారతీయ జనతాపార్టీ (బి.జె.పి)
1980-84, 1986 మరియు 1993–96 – నాయకుడు, బి.జె.పి. పార్లమెంటరీ పార్టీ
1986 – సభ్యుడు, రాజ్యసభ; సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ
1988–90 – సభ్యుడు, హౌస్ కమిటీ; సభ్యుడు, బిజినెస్ అడ్వయిజరీ కమిటీ.
1990-91- ఛైర్మన్, కమిటీ ఆన్ పిటీషన్స్.
1991– పదవ లోకసభకు ఎన్నిక (ఆరవ సారి)
1991–93 – ఛైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ.
1993–96 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్; ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
1996 – 11వ లోక్‌సభకు ఎన్నిక (ఏడవ సారి).
1996 మే 16 – 1996 మే 31 – భారతదేశ ప్రధానమంత్రి.
1996–97 – ప్రతిపక్ష నేత, లోక్‌సభ.
1997–98 – ఛైర్మన్, కమిటీ ఆన్ ఎక్స్‌టెర్నల్ అఫైర్స్.
1998 – 12వ లోకసభకు ఎన్నిక (ఎనిమిదవ సారి).
1998–99 – భారతదేశ ప్రధానమంత్రి; విదేశీ వ్యవహారాలమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
1999 – 13వ లోక్‌సభకు ఎన్నిక (తొమ్మిదవ సారి)
1999 అక్టోబరు 13 నుండి 2004 మే 13– భారతదేశ ప్రధానమంత్రి; ఎవరికీ కేటాయించని మంత్రిత్వశాఖలకు ఇన్‌ఛార్జ్.
2004 – 14వ లోక్‌సభకు ఎన్నిక (పదవ సారి)

రచనలు

సామాజిక మరియు రాజకీయ
నేషనల్ ఇంటిగ్రేషన్. (1961).
డైనమిక్ ఆఫ్ ఎన్ ఓపెన్ సొసైటీ. (1977).
న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. (1979).
హీల్ ద వూండ్స్: వాజ్‌పేయిస్ అప్పీల్ ఆన్ అస్సాం ట్రాజెడీ టు ద పార్లమెంట్. (1983).
వెన్ విల్ అట్రాసిటీస్ ఆన్ హరిజన్స్ స్టాప్?: ఏ.బి.వాజపేయ్స్ స్పీచ్ ఇన్ రాజ్యసభ. (1988).
కుఛ్ లేఖ్, కుఛ్ భాషణ్. (1996).
సెక్యులర్‌వాద్: భారతీయ పరికల్పన (డా. రాజేంద్రప్రసాద్ స్మారక్ వ్యాఖ్యాన్‌మాలా). (1996).
బిందు-బిందు విచార్. (1997).
రాజ్‌నీతీ కి రప్తీలీ రెహమ్. (1997).
న దైన్యం న పలాయనం (హిందీ సంచిక). (1998).
బాక్ టు స్క్వైర్ వన్. (1998).
డిసైసివ్ డేస్. (1999).
శక్తి సే శాంతి. (1999).
‘విచార్ బిందూ (హిందీ సంచిక). (2000). .
నయూ చునౌతీ, నయా అవసర్ (హిందీ సంచిక). (2002).
ఇండియాస్ పర్‌స్పెక్టివ్స్ ఆన్ ఏషియన్ అండ్ ది ఏషియా-పసిఫిక్ రీజన్. (2003).

జీవిత చరిత్రలు

అటల్ బిహారీ వాజ్ మే తీన్ దశక్ (1992).
ప్రధాన్‌మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ఛునే హుయే భాషణ్ (2000).
వాల్యూస్, విజన్ & వర్సెస్ ఆఫ్ వాజపేయ్: ఇండియాస్ మాన్ ఆఫ్ డెస్టినీ (2001).
ఇండియాస్ ఫారిన్ పాలసీ: న్యూ డైమెన్షన్స్ (1977).
అస్సాం ప్రాబ్లం: రిప్రెషన్ నో సొల్యూషన్ (1981)

 

- Advertisement -