షాకింగ్: మరో 48 గంటల్లో నిలిచిపోనున్న ఇంటర్నెట్ సేవలు, ఎందుకంటే…

no-internet
- Advertisement -

Internet-Shutdown

న్యూఢిల్లీ: మరో 48 గంటల్లో ఇంటర్నెట్ నిలిచిపోనుంది. అవును, ఇది నిజమే.  ప్రధాన సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో వచ్చే 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్  సేవలకు అంతరాయం కలగనుంది. రొటీన్‌ మెయింటినెన్స్‌లో భాగంగా ప్రధాన సర్వర్, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేయనున్నారు. ఫలితంగా కొద్ది సమయం ఇంటర్నెట్ సేవలకు ఆటంకం కలుగుతుందని ‘రష్యా టుడే’ తెలిపింది.

ఇటీవల అధికమవుతున్న సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాన సర్వర్ నిర్వహణకు సంబంధించిన కొన్ని పనులు తప్పనిసరని ఇంటర్‌నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్  నేమ్స్ అండ్ నంబర్స్ఐ(సీఏఎన్‌ఎన్) పేర్కొంది. సురక్షితమైన, స్థిరమైన డీఎన్‌ఎస్‌‌ను పొందడం కోసం కొద్దిసేపు ప్రపంచ నెట్‌వర్క్‌ను షట్‌డౌన్ చేయడం అవసరమని తెలిపింది.

ఫలితంగా 48 గంటల్లో వెబ్ పేజీలను యాక్సెస్ చేయడంలో, ట్రాన్సాక్షన్స్ జరపడంలో ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉందని కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారీటీ (సీఆర్‌ఏ) తెలిపింది.

ప్రధాన సర్వర్ నిర్వహణను ఇంటర్‌నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్  నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్‌ఎన్) చూస్తుంది. మెయింటినెన్స్‌లో భాగంగా  క్రిఫ్టోగ్రాఫిక్ కీని మారుస్తారు. దీని వల్ల ఇంటర్‌నెట్ అడ్రస్ బుక్ లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) ఎంతో భద్రంగా ఉంటుంది. అవుట్ డేటెడ్ ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్(ఐఎస్‌పీ) వాడకందారులకు కొంత అసౌకర్యం తప్పదని వెల్లడించింది.

- Advertisement -