రెచ్చిపోతున్న ‘కరోనా’: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. 30 వేలకుపైగా ఆ రెండు రాష్ట్రాల్లోనే…

- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలలో వైరస్ రెచ్చిపోతోంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ కేసుల పెరుగుదలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 

తాజాగా 16,40,287 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 44,643 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శుక్రవారం కేంద్రం ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.18 కోట్లకు చేరగా, ఇప్పటి వరకు 4.26 లక్షల మంది ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు.

తాజాగా దేశంలో 44,643 కేసులు వెలుగు చూడగా, మరో 464 మంది ప్రాణాలు కోల్పోయారు.  4 శాతం మేర కేసుల్లో పెరుగుదల ఉన్నట్లు నిర్ధారించారు. 

కేరళలో 22 వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇటు మహారాష్ట్రలోనూ 9 వేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. 

- Advertisement -