కాషాయ తీర్థం పుచ్చుకున్న ‘దంగల్’ నటి

4:53 pm, Mon, 12 August 19

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో దంగల్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హరియాణాకు చెందిన ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫొగట్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయనకు ఉన్న ఇద్దరు కుమార్తెలు గీతా ఫొగట్, బబితా ఫొగట్‌‌లపై ప్రముఖంగా కథ నడించింది. ఈ చిత్రం ఎందరినో ఆకట్టుకుంది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

ప్రస్తుతం హరియాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావీర్ పొగట్, ఆయన కుమార్తె బబితా ఫొగట్‌లు బీజేపీలో చేరారు. కామన్ వెల్త్ గేమ్స్‌లో మహిళల రెజ్లింగ్ పోటీలో బబిత రెండుసార్లు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. హరియాణా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజుజు సమక్షంలో వీరు కషాయ కండువా కప్పుకున్నారు.

ఈ ఏడాది నవంబర్‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెజ్లింగ్ స్టార్లు బీజేపీలో చేరడం ఆ పార్టీకి పార్టీకి బాగా ఉపకరిస్తుందని అంటున్నారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహావీర్ ఫొగట్ స్థానిక రాజకీయ పార్టీ అయిన జననాయక్ జనతా పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.