ముంబై: భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఎయిర్‌టెల్ ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సెల్యులర్ సేవలు, హోమ్ బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ తదితర సేవల్లో ఒకటికి మించి వాడే వారికి ఇకపై వేర్వేరు బిల్లులు జారీ చేయకుండా ఎన్ని కనెక్షన్లు, సేవలు పొందుతున్నా గానీ ఒకే సమగ్రమైన బిల్లు జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు, బిల్లు మొత్తంపై 10 శాతం తగ్గింపు కూడా ఇవ్వనుంది. దీనికి ‘ఎయిర్‌టెల్ హోమ్’ అని పేరు పెట్టింది.
ఈ పథకంలో.. ఒక ఇంటికి ఎన్ని కనెక్షన్లున్నా బిల్లు ఒక్కటే. ఒకటికి మించి ఎయిర్ టెల్ సేవలు పొందే వారిని ప్రీమియం కస్టమర్లుగా పరిగణిస్తూ.. వీరి కోసం వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా కస్టమర్ కేర్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ సేవ కోసం ఎయిర్ టెల్ కస్టమర్లు ‘మై ఎయిర్‌టెల్ యాప్’ను తమ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునా ఆయా కనెక్షన్లు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.