రాయ్‌పూర్/ప్రకాశం: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిలాయ్ నుంచి డొంగరగఢ్‌కు వెళుతున్న కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మరోవైపు గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మృతులంతా ప్రకాశం జిల్లా హనుమంతుపాడు మండలం మగపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఓ శుభాకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మృతులను పాపబతిని పెద్ద మంగయ్య, వెంకట లక్ష్మీ, అనూష, వెంకన్న గుంట గ్రామానికి చెందిన ఆది నారాయణ, సావిత్రి, గార్లపేట గ్రామానికి చెందిన విజయ్, నాగమణి, వెలిగండ్ల మండలం, పాపయిపల్లికి చెందిన చిట్టి మంజు, వెంకట లక్ష్మీగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని చిట్టిబాబు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతుల దేహాలను సొంత గ్రామాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.