సెంచరీతో చెలరేగిన రోహిత్…చిరకాల ప్రత్యర్ధిని చిత్తు చేసిన టీమిండియా

- Advertisement -

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది…వరుస మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన టీమిండియా….చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కూడా అదిరిపోయే విజయాన్ని సాధించింది.

తద్వారా ప్రపంచ కప్‌లో పాక్‌పై భారత్ 7వ విజయం సాధించి….తన పాత రికార్డుని కొనసాగించింది. ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) పరుగులతో పాకిస్థాన్‌పై భారీ విజయం సాధించింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌….ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ (113 బంతుల్లో 140; 14ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బంతుల్లో 77, 7 ఫోర్లు), రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో 336/5 భారీ స్కోరు చేసింది.

ఈ ముగ్గురు పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ…..బౌండరీల వర్షం కురిపించారు. ఇక హర్ధిక్ పాండ్యా 19 బంతుల్లో 26 పరుగులు చేశాడు. చివరిలో విజయ్ 15, జాదవ్ 9 పరుగులు చేయడంతో భారత్ 336/5 పరుగులు చేసింది.

ఇక లక్ష్యఛేదనలో పాక్ 40 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులకు పరిమితమైంది. కుల్దీప్ (2/32), పాండ్యా (2/44), శంకర్ (2/22) ధాటికి పాకిస్థాన్ 34.4 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302గా సవరించారు. అప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటవడంతో పాక్‌కు ఓటమి అనివార్యమైంది.

ఫఖర్ జమాన్ (75 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (48; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

చదవండి: ఇంగ్లాండ్ చేతిలో చిత్తూ చిత్తుగా ఓడిన వెస్టిండీస్
- Advertisement -