షాకింగ్: నడిరోడ్డుపై నగ్నంగా పరుగుతీసిన మహిళ? కారణం ఏంటో తెలుసా?

6:10 pm, Thu, 7 February 19
women chases after boy friend naked on ny road at new yark

 

hd-wallpaper-of-statue-of-liberty-in-new-york

న్యూయార్క్: ఇతర దేశాల సంస్కృతికి, మన భారతదేశ సంస్కృతికి చాలాపెద్ద తేడా ఉంది. మన సంస్కృతికి మెచ్చి ఇతర దేశాల వారు ఇండియన్స్ అంటే గౌరవం ఇస్తారు. అయితే తాజాగా న్యూయార్క్ లో జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.

అసలు విషయం ఏమిటంటే.. న్యూయార్క్ నగరంలోని ఓ బిజీ రోడ్డులో ఎవరి పనుల మీద వాళ్లు హడావుడిగా ఉన్నారు. ఇంతలో అక్కడ జరిగిన ఘటన వారి మతులు పోగొట్టేసింది. ఓ మహిళ ఒంటిపై నూలుపోగు లేకుండా రోడ్డుపై పరిగెడుతోంది. అసలేం జరుగుతుందో ప్రజలకు అర్థం కాలేదు. ఆ తరువాత ఆమె ఎవర్నో వెంబడిస్తోందని అర్థమైంది.

ఎంత ఫారిన్ అయితే మాత్రం నగ్నంగానా…

కానీ, ఎంత వెంబడిస్తే మాత్రం మరీ అలా నగ్నంగానా? అంటూ చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని, ఆ మహిళ కోసం గాలింపు మొదలెట్టారు. కొంతసేపటి తర్వాత ఓ అపార్ట్‌మెంటు పార్కింగ్ ఏరియాలో ఉన్న ఓ జంటను అదుపులోకి తీసుకున్నారు. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

కెర్రీ సూ స్మిత్ అనే మహిళ డంటె హెడ్చ్‌పాత్ అనే వ్యక్తి చిన్నప్పటి స్నేహితులు. చాలాకాలం తర్వాత వారిద్దరూ కలవడంతో దగ్గరలోని ఓ హ‌ోటల్‌లో రూం తీసుకుని మందు తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ప్రారంభించారు. కాసేపటికి మత్తెక్కువైన కెర్రీ, తనను పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని డంటెను కోరింది. నెమ్మదిగా ఒంటిపై దుస్తులు ఒక్కొక్కటే తీసేయడం మొదలెట్టింది.

ఆమె మాటలు చేతలు అనుమానాస్పదంగా ఉండటంతో డంటె షాకయ్యాడు. ఆమె ప్రవర్తనకి ఒక్కసారిగా షాక్ అయిన డంటె, ఆమె ఆగేలా లేదని నిర్ధారించుకున్న వెంటనే ఆ గదిలోంచి బయటకు పరిగెత్తాడు. కానీ అతన్ని వదలడం కెర్రీకి ఇష్టం లేదు.

ఇక ఆలస్యం చేస్తే ఎక్కడ మిస్ అవుతాడో అని భావించి అతన్ని వెంబడించింది. అప్పటికే నగ్నంగా ఉండటం, మళ్లీ దుస్తులు ధరించేలోపు డంటే ఎక్కడ  చేజారిపోతాడో అన్న ఆలోచనతో ఆమె అలా నగ్నంగానే అతని వెంటపడింది. అతను రోడ్డుపైకి చేరుకోవడం చూసి, ఆమె కూడా అతడ్ని వెంబడిస్తూ నడిరోడ్డుపైకి వచ్చేసింది.. అదీ జరిగింది!