సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాక్ మంత్రి

11:42 am, Wed, 7 August 19

ఇస్లామాబాద్: బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతిపై పాకిస్థాన్ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాజ్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో ట్విట్టర్ యుద్ధాన్ని తాను మిస్సవుతున్నట్టు ఫవాద్ పేర్కొన్నారు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం గట్టిగా పోరాడే వ్యక్తి సుష్మా స్వరాజ్ అని ప్రశంసించారు.

గతంలో పలుమార్లు ఫవాద్-సుష్మ మధ్య ట్విట్టర్‌లో వాగ్వివాదం నడిచింది. పాక్‌లో మైనారిటీలైన హిందూ యువతులను ఎత్తుకెళ్లి బలవంతంగా మాతమార్పిడి చేసి వివాహం చేసుకుంటున్నారని సుష్మ ట్విట్టర్‌లో విమర్శించారు. పాక్ మంత్రి ఫవాజ్ సుష్మ ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ట్విట్టర్‌లో చిన్నపాటి యుద్ధం జరిగింది. తాజాగా ఈ అంశాన్ని ఫవాద్ ప్రస్తావించారు.