కర్నూలు లోక్‌సభ వైసీపీ అభ్యర్థిగా.. పేదల డాక్టర్ సంజీవ్ కుమార్

Dr. Sanjeev Kumar Latest News, YCP Latest News, AP Parliament News, Newsxpressonline

కర్నూలు జిల్లా.. అంటే పేరుకు మాత్రమే గొప్ప..
కానీ అక్కడ అభివృద్ధి 50 ఏళ్ల క్రితం ఎలా ఉందో.. ఇప్పటికి అలాగే ఉంది.. ఎందరో ఎంపీలు గెలుస్తున్నారు.. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు.. ఓట్లు వేయించుకుంటున్నారు..

మళ్లీ ఐదేళ్లకు గానీ కనిపించడం లేదు..కనీసం పార్లమెంటులో సభ్యుడిగా ఉంటూ..తమ కర్నూలు జిల్లా అభివృద్ధికి లేదా ప్రజలకు సంబంధించి ఎన్నో సమస్యలున్నా..కనీసం ఒక్క ప్రశ్న కూడా లోక్ సభలో అడిగేవారే కరువయ్యారు.

కూటికోసం.. కూలికోసం.. ఉన్నవూరిని, కన్నతల్లిని వదిలి..

జిల్లాలో ఎన్నో వనరులున్నాయి..ఎన్నో జీవ నదులున్నాయి..అన్నీ పక్క నుంచి వెళుతుంటాయి..కానీ ఇక్కడ యువతకు ఉపాధి మాత్రం ఉండదు. పరిశ్రమల్లో అవకాశాలు రావు.. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే చదువుతారు..కానీ అవకాశాలే ఉండవు.

అందరూ హైదరాబాద్, చైన్నై, బెంగళూరు, తిరుపతి ఇలా వలస కార్మికుల్లా భార్యాబిడ్డలను వదిలేసి దూరంగా వెళ్లిపోతుంటారు. కొందరు పిల్లలను వదిలేసి..భార్యాభర్తలిద్దరూ వెళ్లిపోతుంటారు..ఆ మహాకవి శ్రీశ్రీ ఆనాడెప్పుడో చెప్పాడు..బహుశా కర్నూలు జిల్లాను చూసే అయి ఉండాలి… ఉన్నవూరిని, కన్నతల్లిని వదిలేసి కూటికోసం..కూలికోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికీ అలాగే ఉంది..

ఎవరూ అడగరు..ఎవరూ ప్రశ్నించరు..

ఏమిటీ దుస్థితి? ఎప్పటికి మారుతుందీ పరిస్థితి..ఎన్నాళ్లిలా చూడాలి..? ఆ ఆసుపత్రికి వచ్చే నిత్యం వందలాది బాధితుల ఆత్మఘోష..ఏళ్ల తరబడి ఆయన చూస్తూనే ఉన్నారు..ఈరోజు బాగుంటుది..రేపు బాగుంటుంది.. ఎల్లుండు బాగుంటుంది..ఇలా చూసుకోవడమే..ఏళ్లు గడిచిపోతున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చి అప్పుడే 72 సంవత్సరాలు గడిచిపోయాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే కర్నూలు జిల్లాలో నాలుగులైన్ల రోడ్లు తప్ప మరొకటి కనిపించదు.. ఏమిటీ దుస్థితి? అని ఆయన నిత్యం ఆలోచించేవారు. ఆ పేద ప్రజల కోసం ఏదైనా చేయాలని తపించేవారు. ఆయన చదువుకునే రోజుల్లో.. ఆ సోషల్ మాస్టారు ఎప్పుడూ చెప్పే ఒక వాక్యం.. తననెప్పుడూ వెంటాడేది.. అదేమిటంటే..

‘‘ఒక బుద్ధిహీనుడి పరిపాలన కంటే..
ఒక మేధావి మౌనమే రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ హాని చేస్తుంది..’’

ఈ వాక్యం ఆయనలో ఒక ప్రశ్నను లేవదీసింది. ఆ పనేదో మనమే ఎందుకు చేయకూడదు..ఆ రాజకీయాల్లోకి మనమే ఎందుకు వెళ్లకూడదు? మనం అనుకునే ఆ పేద ప్రజలకు సేవ ఎందుకు చేయకూడదు.. అనుకున్నదే తడవుగా ప్రయత్నం చేశారు.

తనెంతో అభిమానించే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అయితే ప్రజాసేవకు అవకాశం ఉంటుందని భావించారు. ఎంపీ బుట్టా రేణుక ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు.
ఇంతకీ ఎవరా డాక్టర్ గారు అనే కదా.. మీ సందేహం…

నేడు కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు.
డాక్టర్ సంజీవ్ కుమార్..’ఆయుష్మాన్ ది ఫ్యామిలీ హాస్పటల్‘ వ్యవస్థాపకులు

వైద్యవృత్తి అంటే..పవిత్రమైన వృత్తి అని అందరూ అంటారు.. అనారోగ్యంతో కష్టంలో ఉండి ప్రజలు వస్తే వారికి సాంత్వన చేకూర్చి..వారికి అతి తక్కువఖర్చుతో వైద్యం అందించాలనేది ప్రాధమిక కనీస ధర్మం..కానీ నేటి రోజుల్లో వైద్యం వ్యాపారమైపోయిన కాలంలో..ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు..

కేవలం డాక్టర్ గారిని కలవాలంటేనే వంద రూపాయల నుంచి మూడు వందలు ఇంకా అత్యవసరమైతే ఐదు వందలు..ఇలా వారిష్టం… ఇక చిన్నపిల్లలకు జ్వరమొస్తే టెస్ట్ లపేరుతో పీల్చిపిప్పి చేస్తున్న నయా డాక్టర్లు..ఇక ఆపరేషన్లు అవసరమైతే..ఆస్తులమ్మి లక్షల రూపాయలు ఆసుపత్రులకు ధారపోసే పరిస్థితులున్న ఈ రోజుల్లో..

నేనున్నాను అంటూ ఆపన్నహస్తం అందించి…

.అతి తక్కువ ఫీజుతోనే డాక్టర్ గారిని కలిసే అవకాశం ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉందంటే అతిశయోక్తి కాదు..ఇది నిజంగా కర్నూలు జిల్లా, చుట్టు పక్కల ప్రజల అదృష్టమనే చెప్పాలి.. ఒకవేళ ఆపరేషన్ అవసరమైతే అతితక్కువ ఖర్చుతో కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే తీసుకొని చేసే మనసున్న మారాజు..మా డాక్టరు బాబు అని అందరూ కొనియాడుతుండటం ఒక గొప్ప విషయం..ఇంతకీ ఆ డాక్టరు గారు ఎవరంటే..ఇంతకుముందు పైన చెప్పుకున్న

కర్నూలు ఎంపీ స్థానానికి వైఎస్సార్సీపి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న
డాక్టర్ సంజీవ్ కుమార్

Dr. Sanjeev Kumar Latest News, YCP Latest News, AP Parliament News, Newsxpressonline

ఏదైనా చిన్నపాటి అనారోగ్యమొస్తే.. కర్నూలు జిల్లాలో ప్రజలకు చటుక్కున గుర్తుకువచ్చే పేరు..ఆయుష్మాన్  ఆసుపత్రి డాక్టరుగారు..

మనసులో మరో ఆలోచన లేకుండా పరుగులు పెట్టే జనం.. ఏమంటున్నారంటే.. మేం ఆపదలో ఉంటే ప్రాణాలు కాపాడి ఆదుకునే మహానుభావుడు..ఆ డాక్టరు బాబు.. ఈసారి మాకు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. తప్పకుండా సార్ కే ఓటు వేసి..

ఆయనను గెలిపించుకుంటాం. మాకెంతో మంచి చేసే డాక్టర్ గారు గెలిస్తే.. ఇంకా మంచి పనులు చేసి, కర్నూలు జిల్లాను అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం అంటున్నారు..ఇంత ప్రజాభిమానాన్ని పొందిన ఆ ఆయుష్మాన్ ది ఫ్యామిలీ హాస్పటల్, ఆ పేద ప్రజల డాక్టర్ సంజీవ్ కుమార్ గారి గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే…

ఒక అత్యుత్తమ ఆశయంతో..

వైద్యవృత్తికి న్యాయం చేస్తూ.. పేద ప్రజల ఆరోగ్యమే తన డాక్టర్ సర్టిఫికెట్ కి అర్థం, పరమార్థమని భావించి..వారికి అత్యంత చౌకగా వైద్యం అందించే డాక్టర్ సంజీవ్ కుమార్ అంటే పేరు తెలియని వారు కర్నూలు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు..

ఇంకా ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..

ప్రతిరోజు ఉదయం..రెడీ అయ్యి.. ఆరోజు ముఖ్యమైన పనులేవీ లేకపోతే.. ప్రజాసేవ కోసమని గ్రామాలకు వెళుతుంటారు. అలా ప్రజలదగ్గరకు వెళ్లి వైద్యం అందించడంలోనే తనకు ఆత్మసంతృప్తి ఉందని చెప్పే డాక్టరు గారు..

తనకి ఓపిక ఉన్నంతవరకు ఇలా నేను నమ్మిన సిద్ధాంతంలోనే పని చేస్తుంటానని ఘంటాపథంగా చెబుతుంటారు. అందులో కష్టమైనా, నష్టమైనా, బాధలున్నా, సంతోషమున్నా.. అదే దారిలో తను నమ్మిన సిద్ధాంతాలతో మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతుంటారు.అదే ఆయన ప్రత్యేకత.

కర్నూలులో 27 ఏళ్లకు పైగా…

జిల్లాలోని ప్రజలందరికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నారు. మందులు కూడా ఖరీదైనవి కాకుండా అవసరమైన మేరకే రాసి..ఎందరో మన్ననలు పొందే డాక్టర్ సంజీవ్ కుమార్ గారంటే ప్రజలు అనేమాట..

డాక్టర్ గారు మాకు దైవంతో సమానం.

తన దగ్గరకు వచ్చేవారిని అతితక్కువ ఫీజుతో చూడటమే కాదు..ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసుపత్రికి రాలేకపోతున్నారని భావించి.. వారానికి రెండుమూడురోజులు గ్రామాల్లో పర్యటిస్తుంటారు. కొన్నిచోట్ల ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటారు.

సాధ్యమైనంతవరకు అక్కడ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసి..ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంటారు. జల్లాలోని పలుచోట్ల మారుమూల ప్రజలు జ్వరాలతో, ఇతర రోగాలతో అవస్థలు పడుతుంటారు..కానీ ఇక్కడ కర్నూలు జిల్లాలో పలుచోట్ల అలాంటి మూకుమ్మడి అనారోగ్యం కేసులు చాలా తక్కువనే చెప్పాలి.

ఎందుకంటే ఆ ఊరికి అందరికన్నాముందు ఈయనే వెళ్లిపోతారు.

ముఖ్యంగా మలేరియా జ్వరాలు, కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులకు ఆ వైద్యశిబిరంలో ఉచితంగా వైద్యం చేస్తుంటారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వృద్ధులకు పెన్షన్లు అందిస్తారు. వృద్ధాశ్రమాలకు నిధులిస్తుంటారు. పేద విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్ షిప్పులు అందిస్తుంటారు. ఇలా ఒకటికాదు తనకి చేతనైంత వరకు సాయం చేయాలన తలంపుతో ముందుకెళుతుంటారు.

ఆశ్చర్యకరమైన గొప్ప విషయమేమిటంటే…

ఆ డాక్టర్ గారి కుటుంబంలో తన అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు అందరూ డాక్టర్లే..అంతేకాదు అలా తమ ఫ్యామిలీ నుంచి 27మంది వరకు వైద్యులున్నారు. అందరూ సేవాదృక్పథం ఉన్నవారే..అందరి భావాలు ఒక్కటే..పేదవారికి వైద్యం అందించాలి. వీరందరూ వైద్యవృత్తిలో వివిధ విభాగాలలో ఎమ్మెస్ చేసిన వారున్నారు..అవసరమని అనుకుంటే..వారు సీన్ లోకి వచ్చి.. వైద్యం అందిస్తుంటారు. చివరికి డాక్టర్ గారమ్మాయి కూడా ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేయడం విశేషం.

ఖరీదైన ఏడెకరాల భూమి పేదవాళ్ల గృహాల కోసం..అందించిన సేవామూర్తులు

డాక్టర్ గారి అన్నదమ్ములు, అక్కచెళ్లెల్లు అందరూ కలిసి తమకు వారసత్వంగా వచ్చిన అతి ఖరీదైన ఏడెకరాల భూమిని పేదవారి ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా రాసి ఇచ్చారు. అక్కడ 147 ఇళ్లు నిర్మించుకొని పేదవారు నివాసం ఉంటున్నారు. ఇది ఒక కాలనీగా ఆంజనేయ నగర్ పేరుతో అభివృద్ధి చెందడం విశేషం. ఆ భగవంతుడు దయ వల్ల చాలామందికి ధనవంతులు అవుతారు..కానీ అందులో చాలా కొద్దిమందికి మాత్రమే పేదవారికి, పుట్టిన ఊరికి సేవ చేయాలనే గుణం ఉంటుంది.

రేపటి తరం వలసలు పోతుంటే.. బానిసల కార్ఖానాగా జిల్లా మారిపోతుందనే బాధ

నిత్యం పేద ప్రజలకు తనవంతు సాయమందించే డాక్టరు గారు.. కర్నూలు జిల్లాలో యువత ఉద్యోగాల్లేక వలసలు పోతుంటే.. తమ జిల్లాలోరేపటి తరం.. మరొక బానిస కుటుంబాలుగా మిగిలిపోవడం చూసి ఆయన చలించిపోయారు.

ఇలాగే ఊరుకుంటే ఈ జిల్లా బానిసల కార్ఖానాగా మారిపోవడానికి ఇంకెంతో కాలం పట్టదని భావించి.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఆయన..ఈసారి రాజకీయాల్లోకి వస్తే మరింత విస్తృత స్థాయిలో సేవ చేసే అవకాశం దొరుకుతుంది అనుకున్నారు.. అదే తడవుగా వైస్ జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వైస్సార్ సీపీలో చేరి కర్నూలు నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నారు.

Dr. Sanjeev Kumar Latest News, YCP Latest News, AP Parliament News, Newsxpressonline

ప్రజలు కూడా చెప్పడమేమిటంటే..

సార్..మీరు రాజకీయాల్లోకి రండి.. మాకెంతో మేలు జరుగుతుంది..మీలాంటి వాళ్లు రావాలి.. అని అందరూ అడగడం కూడా తనలో ఒక ఆలోచన కలిగేందుకు కారణంగా సన్నిహితులు చెబుతుంటారు. ఇలాచూస్తే..ఆయన వ్యక్తిత్వం, స్వభావం, ప్రజాసేవ చేసే తత్వం..ఇవన్నీ చూస్తే… ప్రజా కోరిక మేరకే ఆయన రాజకీయ ప్రవేశం చేశారని కచ్చితంగా చెప్పవచ్చు..

మీకు మంచి జరగాలి..అందుకే నేను వస్తున్నా.. అంటున్నారు డాక్టర్ గారు

మీకు నేను సేవ చేస్తున్నాను కాబట్టి అందుకు ప్రతిఫలంగా ఓటు వేయమని ఆయన అడగరు. మీకు మంచి నాయకుడు కావాలా? వద్దా? మీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే వారు కావాలా? వద్దా? ఎన్నాళ్లిలా ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతారు..అని మాత్రమే ప్రశ్నిస్తుంటారు. పేరుకే కర్నూలు..

ఇప్పటివరకు ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన వారంతా సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప.. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలకు ఒరగబెట్టిందేమీ లేదు. 50 ఏళ్ల క్రితం అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది.రాష్ట్రమంతా అభివృద్ధి చెందింది..అదిగో అమరావతి అంటున్నారు..మరి ఇదిగో కర్నూలు జిల్లా అని చెప్పగలుగుతున్నారా….వీళ్ల హయాంలో ఎంత అభివృద్ధి చెందిందో..

అందరికీ తెలిసిన విషయమే.. అందుకే ఎన్నో ఏళ్లుగా తను నమ్మిన సిద్ధాంతం కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తూ.. ప్రజలకు సేవ చేస్తున్న డాక్టరు సంజీవ్ కుమార్ ఈసారి తప్పకుండా విజయం సాధిస్తారని స్థానికులు పేర్కొనడం విశేషం.

– శ్రీనివాస్ మిర్తిపాటి