వైఎస్‌ వివేకానందరెడ్డి మృతిపై పలు అనుమానాలు…కేసు నమోదు!

YS Vivekananda Reddy's many suspicions on the case , Newsxpressonline

కడప: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయిన వివేకానందరెడ్డి పులివెందులలో మృతిచెందారు.

వివేకానంద రెడ్డి మృతిపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివేకా తలకు, చేతికి గాయాలు అయ్యాయని, ఆయన రక్తపు మడుగులో.. బాత్‌రూమ్‌లో పడి ఉన్నారని కృష్ణారెడ్డి తెలిపారు.

దీంతో అనుమానాస్పద మృతిగా కేసు (నంబర్ 84/19) నమోదు చేశామని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.