అమ్మానాన్నలు ఆదర్శ దంపతులు.. లోకేశ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు

4 days ago

అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ రోజు అమ్మానాన్నల పెళ్లిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ.. ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు అని పేర్కొన్నారు.

ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్లు వర్థిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.