ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కియా మోటార్స్‌ కీలక ఒప్పందం.. బహుమతిగా మూడు కార్లు…

kia motors key mou with AP govt on partnership for future eco mobility
- Advertisement -

kia motors key mou with AP govt on partnership for future eco mobility

అమరావతి: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ మొబిలిటీ పార్టనర్‌షిప్‌‌ ‘భవిష్యత్ తరం పర్యావరణ రవాణా’పై ఎంవోయూ చేసుకుంది.

ఈ అవగాహన ఒప్పందంపై ఏపీఐఐసీ ఎండీ ఎ.బాబు.. కియా మోటర్స్ సీఈవో షిమ్ సంతకాలు చేశారు. గురువారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు, కియా మోటార్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సచివాలయంలో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌, ఎలక్ట్రిక్‌ కార్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

ఆంధ్రకు కార్లు బహూకరించిన కియా మోటార్స్…

కియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరో హైబ్రిడ్‌, నిరో ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌, నిరో ఎలక్ట్రికల్‌ కార్లను బహుమతిగా ఇచ్చింది. కారు తాళాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్లను సీఎం టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు.

కియా ఎలక్ట్రిక్ కార్లను ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసే వీలుంటుంది. త్వరలో విజయవాడలో వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను కియా మోటార్స్‌ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. పరిశ్రమలను ప్రోత్సహించడానికి కియా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించారు.

ఆటోమొబైల్ హబ్‌గా.. ఆంధ్రప్రదేశ్

కియా రాకతో వెనుకబడిన అనంతపురం జిల్లా జాతకం  పూర్తిగా మారిపోయిందన్నారు. ఇసుజు, హీరో, భారత్ ఫోర్జ్, అశోక్ లేల్యాండ్, అమర్‌రాజా వంటి ఆటో రంగ సంస్థలతో ఆంధ్ర ఆటోమొబైల్ హబ్‌గా మారిందన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయనే ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రని పర్యావరణహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.  కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ కార్లు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్‌లో యూనిట్‌ సౌర విద్యుత్ రూపాయిన్నరకే లభిస్తుందని.. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబునాయుడు చెప్పారు.

- Advertisement -