వైఎస్సార్ సీపీఎల్పీ నేతగా ఎన్నికైన జగన్….  

12:03 pm, Sat, 25 May 19

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యేలు… తీర్మానం ద్వారా ఆయనను తమ పార్టీ శాసనసభా నేతగా ఎనుకున్నారు.

పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఇందుకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టగా… సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ తీర్మానాన్ని బలపరిచారు.

ఇక వైసీపీఎల్పీ నేతగా జగన్‌ను ఎన్నుకున్న తీర్మానం కాపీని వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు అందజేయనున్నారు. ఈ రోజు సాయంత్రం జగన్ గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించనున్నారు. కాగా, జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

చదవండి: ఎంత అప్రదిష్ట? రాయలసీమలో టీడీపీ గెలిచింది 3 సీట్లేనా…!?